ఓంకారేశ్వర్

భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఖాండ్వా జిల్లాలో ఉంది. ఇది మధ్యప్రదేశ్లో Mortakka నుండి సుమారు 12 మైళ్లు (20 కి.మీ.) దూరంలో వుంటుంది. ఓంకారేశ్వర రివర్ నర్మదా ఏర్పడుతుంది. ఈ నది భారతదేశంలోని నదుల్లో పవిత్రమైన నది, ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్ట ప్రాజెక్టులో ఒకటి ఇక్కడ ఉంది. రెండుకొండల మధ్య నుండి ప్రవహించే నర్మదా నది, ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుండి చూస్తే ‘’ఓం ‘’ఆకారం గా కని పిస్తుందిట. అందుకే ఓంకార క్షేత్రం అని పేరు. ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం అని రాయబడి ఉంటుంది.

ఇక్కడి ప్రధాన దైవం శివుడికి అంకితం హిందూ మతం ఆలయం. ఇది శివున్ని గౌరవించే జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి. ఇది నర్మదా నదిలో Mandhata లేదా పురి అని ఒక ద్వీపంలో ఉంది; ద్వీపం ఓం ఆకారంలో హిందూ మతం చిహ్నంగా ఉంటుంది అని చెప్పబడుతుంది. ఇక్కడ రెండు దేవాలయాలు ఉన్నాయి, ఓంకారేశ్వరం అని ఒకటి (దీని పేరు “లార్డ్ ఓంకార “), అమరేశ్వర్ అని ఇంకోకటి (దీని పేరు “ఇమ్మోర్టల్ లార్డ్” లేదా “ఇమ్మోర్టల్స్ లేదా దేవతలు ప్రభువు” అర్థం). కానీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ప్రకారం, మమలేశ్వర్ అనే జ్యోతిర్లింగం నర్మదా నదికి ఇతర వైపు ఉంటుంది.

మధ్య ప్రదేశ్ లో నర్మదా నదీ తీరాన ఓంకార జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఉజ్జైన్ కు సుమారు రెండు వందల కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి శివ లింగం ‘’భాణలింగం ‘’. నర్మదానదిలో లభించిన భాణలింగం అత్యుత్తమమైనదని శివపురాణం చెప్పింది. అన్ని నదులూ  తూర్పు  దిశగా ప్రవిహించి సముద్రం లోకలిస్తే, నర్మదా నది పడమర గా ప్రవహించి అరేబియా సముద్రం లో కలవటం విశేషం. అదీ ఈక్షేత్ర ప్రశస్తి. ఉజ్జైన్ దేవాలయం లో కింద శ్రీ మహా కాలేశ్వరుడు, పైన ఓంకారేశ్వరుడు ఉంటారు. కానీ ఓంకారేశ్వరంలో కింద ఓంకారేశ్వరుడు, పైన మహా కాలేశ్వరుడు ఉండటం విచిత్రం. గుడి నాలుగు అంతస్తులుగా ఉంటుంది. కింద ఓంకారేశ్వరుడు, మొదటి అంతస్తులో మహా కాలేశ్వరుడు ఉండగా మిగిలిన అంతస్తులలో ఉప ఆలయాలు ఉంటాయి. శివుడు అమ్మవారి విగ్రహాలు ఇందులో ఉన్నాయి. నర్మదానది నర్మదా, కావేరికా అనే రెండు పాయలుగా చీలి ప్రవహిస్తోంది. ఈ రెండు పాయల మధ్య ప్రదేశాన్ని శివ పురి మాం దాత్రు పురి అని పిలుస్తారు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉందట. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్రీకరిస్తుందని భావిస్తారు.

పురాణ గాథ

సూర్య వంశానికి మాంధాత రఘు వంశ మూల పురుషుడు. మాంధాత ఇక్కడేపర్వతం పై తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకొన్నాడు. స్వామి అనుగ్రహం తో ఇక్కడే పర్వతం మీద ఆలయం నిర్మించాడు. ఈ పర్వతంమీద ఉన్న అనేక దేవాలయాలు ఓం అనే ప్రణవ ఆకారంలో ఉండే ఓంకారేశ్వర్ దేవాలయం ప్రణవం పై సూర్య భగవానుడిలాగా ప్రకాశిస్తోంది. దగ్గరలో విష్ణుపురి బ్రాహ్మ పురి కొండలున్నాయి. వాటి మధ్య నుంచి కపిల ధార అనే నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తుంది. ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రం లో శివుని అర్చించి తిరిగి వస్తూ వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు వింధ్యుడీ పూజని గ్రహించాడు. తనలో రత్న మాణిక్యాలున్నాయని వింధ్యుడు గర్వం గా మహర్షితో అన్నాడు. ’’నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే.ళమేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించాయి ‘’అన్నాడు. సిగ్గుపడ్డ వింధ్యుడు శివునికోసం ఆరు నెలలు ఈ క్షేత్రంలో ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుని చూడగానే మనో బాధలు పోయాయి. తనకు ప్రశాంత మనసు ఏర్పడిందని తన శిరస్సుపై శాశ్వతంగా ఉండిపొమ్మని శివుని వేడుకొన్నాడు. సంతోషించిన శివుడు ప్రణవాకారాంలో జ్యోతిర్లింగంగా ఇక్కడే స్థిర పడిపోయి భక్తుల అభీష్టాలను నేర వేరుస్తున్నాడు. ఓంకా

రేశ్వరుడని, పార్దివాకారంలో అమలేశ్వరుడని రెండు పేర్లతో ఈ జ్యోతిర్లిన్గాన్ని అర్చిస్తారు.

 

 

ఓంకార క్షేత్రం లోనే ఆది శంకరాచార్యులవారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఈయన గురువు గారితో నివసించిన గుహను ఈ మధ్యనే పునరుద్ధరించారు. ఇక్కడి గౌరీ సోమనాధ మందిరంలో శివ లింగ దర్శనం చేస్తేపునర్జన్మ ఉండదని విశ్వాసం. రాబోయే జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయట. అందరూ గర్భాలయం చేరి అభిషేకం చేయవచ్చు.

About the Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these

X