C nuw Yatra https://cnuwyatra.in C nuw can give new look to your way Fri, 10 Jan 2025 09:25:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 https://cnuwyatra.in/wp-content/uploads/2024/02/cropped-cropped-yatra-logo-final-scaled-1-32x32.jpg C nuw Yatra https://cnuwyatra.in 32 32 నైమిశారణ్యం https://cnuwyatra.in/2025/01/10/%e0%b0%a8%e0%b1%88%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be%e0%b0%b0%e0%b0%a3%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/ https://cnuwyatra.in/2025/01/10/%e0%b0%a8%e0%b1%88%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be%e0%b0%b0%e0%b0%a3%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/#respond Fri, 10 Jan 2025 09:23:34 +0000 https://cnuwyatra.in/?p=871

నైమిశారణ్యం

 

నైమిశారణ్యం వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. ఇక్కడ వనరూపిగా నున్న స్వామికే ఆరాధన జరుగుతుంది. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరుమాళ్ళు గాని ఇక్కడ లేవు. నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం.

ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్భతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పెనట. అది పడిన చోటే నైమిశారణ్యము. ఇచట గోమతీ నది ప్రవహిస్తుంది. ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు. ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణాలు వినిపించాడు.

ఈ అరణ్యంలో దాదాపు 84 వేలమంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు శుకమహర్షికి ఇక్కడే చెప్పాడు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రతవిధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూతమహాముని శౌనికాదులకు వివరించాడు. ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి. ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతోపాటు కొన్ని దేవాలయాలూ ఉన్నాయి.

 

]]>
https://cnuwyatra.in/2025/01/10/%e0%b0%a8%e0%b1%88%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be%e0%b0%b0%e0%b0%a3%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/feed/ 0
శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం) https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%a3%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%a6%e0%b1%87/ https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%a3%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%a6%e0%b1%87/#respond Wed, 08 Jan 2025 11:31:41 +0000 https://cnuwyatra.in/?p=811

శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం, లేదా అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా లోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ-వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది.[1] విష్ణువు అవతారమైన వీర వెంకట సత్యనారాయణకు ఈ ఆలయం అంకితం చేయబడింది.

అలయ నిర్వహణ

ఈ ఆలయం 13 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ క్రింద నిర్వహించబడుతోంది.[3]

స్థలపురాణం

అన్నవరంలో రత్నగిరి పర్వత శ్రేణి.

స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి, మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి కొండ, లేదా రత్నాచలం కొండగా మారుతాడు.[4]

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దూరు ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు ఇతనికి, రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి “రాబోవు శ్రావణ శుక్ల విదియ, మఖ నక్షత్రం, గురువారం నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారం ప్రతిష్టించి సేవించుం” అని చెప్పి మాయమయ్యారని కథనం

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు (కృష్ణకుటజం) కింద పొదలో స్వామి వారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 న (శాలివాహన శకం 1813) ప్రతిష్ఠించారు.[4]

ఆలయాన్ని సా. శ. 1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నలు గలవి, శూల శిఖరాలతో ఉన్నాయి.అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవత, అంబికా దేవతల ప్రతీకలగు చక్రశిఖరాలు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.

ఆలయ విశేషాలు

భక్తుల విశ్రాంతి కొరకు ఏర్పాటు చేసిన ఉద్యానవనం.

ఆలయాన్ని సా. శ. 1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నాలు ఉన్నాయి, శూల శిఖరములతో ఉన్నాయి. రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలు ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.

అన్నవరం వద్ద పంపా నది

పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉండాలి.

ఈ ఆలయం ఆ ప్రకారం రెండు అంతస్తులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంది.

రవాణా సౌకర్యం

కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై తుని నగరానికి 18 కి.మీ.ల దూరంలో.. కాకినాడ నగరానికి 45 కి.మీ.ల దూరంలో.. రాజమహేంద్రవరానికి 80 కి.మీ.ల దూరంలో.. విశాఖపట్నం నుంచి 120 కి.మీ.ల దూరంలో అన్నవరం ఉంది. అన్నవరం రైల్వేస్టేషన్‌ ద్వారా రైలు కనెక్టివిటీ ఉంది. విశాఖపట్నం.. రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరవచ్చు

 

]]>
https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%a3%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%a6%e0%b1%87/feed/ 0
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం) https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%b5%e0%b0%b0%e0%b0%be%e0%b0%b9-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8d%e0%b0%ae%e0%b1%80%e0%b0%a8%e0%b0%b0%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%b9%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae/ https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%b5%e0%b0%b0%e0%b0%be%e0%b0%b9-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8d%e0%b0%ae%e0%b1%80%e0%b0%a8%e0%b0%b0%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%b9%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae/#respond Wed, 08 Jan 2025 11:27:15 +0000 https://cnuwyatra.in/?p=806

 

వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగరనడిబొడ్డునుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది.ప్రస్తుత ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఒడిషాకు చెందిన తూర్పు గంగా రాజు లాంగుల నరసింగ దేవ I కళింగ వాస్తుశిల్పం ప్రకారం నిర్మించారు, 1268 ADలో అతని కుమారుడు భానుదేవ I చేత ప్రతిష్ఠించబడింది.

ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు (మే నెలలో) వస్తుంది.

స్థలపురాణం

పుష్కరిణి

సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి, కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదునిని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు ‘విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్తంభంలో ఉన్నాడా? చూపించు’ మని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.

స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహనరసింహ స్వామి విగ్రహన్ని ఆరాదించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహనరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహనరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. వరాహం నరుడు, సింహం రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం [[త్రిభంగ ముద్ర]]లో (ఆసనంలో) వరాహం తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ (వైశాఖ పూర్ణిమకు దగ్గరలో) నాటికి చందనం తీసివేసి నిజరూప దర్శనం ఇస్తారు. .

సింహాచలం నడక దారిలో వరాహ మూర్తి ప్రతిమ

శాసన సమృద్ధి

  • సా.శ.1087: సింహగిరి స్వామి నరసింహదేవరగా ప్రఖ్యాతుడు. స్వామి వారి ప్రసూనాల కోసం తిరునందనవనం కల్పించే శాసనం. ఇప్పటి నుండి ఈ దేవాలయంలో ద్రావిడ శ్రీవైష్ణవ సంప్రదాయం కనబడుతుంది.

  • సా.శ.1198: “వాయు స్ఫటికామలాభవపుషే సింహాచలస్థాయినే” = సింహాద్రి నాధుని స్పాటికామలాభ వపువుగా వర్ణించబడింది.

  • సా.శ.1266: గాంగ నరసింహ చక్రవర్తి స్వామి సన్నిధిలో సంకీర్తనం కోసం నూరుగురు స్త్రీలను స్వామివారికి సమర్పిస్తాడు.

  • సా.శ.1268: ఒక శాసనం ఈనాటికీ వ్యవహారంలో ఉన్న అడవివరాన్ని పేర్కొన్నది.

  • సా.శ.1286:

  • సా.శ.1201, 1291: రెండు శాసనాలు దేవాలయంలో వేద పఠన, అధ్యయన వైభవాన్ని తెలియజేస్తున్నాయి.

  • సా.శ.1293: అక్షయ తృతీయనాడు చందన కర్పూరాలు చాదడానికి ఒక నిబంధన చేస్తూ, ఆనాడే పాయసము, అప్పాలు మొదలైన పణ్యారాల ఆరగింపు కోసం నిబంధన కనబడుతుంది.

  • సా.శ.1342: స్వామికి ఒక మహారాణి అనంత లక్ష్మీదేవి అనేక ఆభరణాలు సమర్పించింది. అందులో బంగారు పొగడపూల మాల, సంపెంగ మాల లున్నాయి.

  • సా.శ.1350: వీరనరసింహదేవుల రాణి గంగా మహాదేవి దేవునికి అనేక సమర్పణలు కావిస్తూ వేయించిన శాసనం.

  • సా.శ. 1371: సింహాచలం అన్న పేరు సింహికారోగిరిః నుండి వచ్చినట్లు చెబుతోంది.

  • సా.శ. 1394: సింహగిరి నరహరిని అహోబల దేవరగా పేర్కొనటం జరిగింది.

సింహాచల గోపురం

ఈదేవాలయం లాంగూల గజపతిచే నిర్మించబడిందని పలు శాసనాలు తెలుపుచున్నాయి.ఈ ఆలయం లోని శాసనకాలం సా.శ.1100 నుండి 7శతాబ్దాలవరకు వ్యాప్తం. తూర్పుగాంగులు, రెడ్డిరాజులు, నందపురాన్ని పాలించిన శిలావంశయుజులు, మత్స్య వంశీయులు, గజపతులు స్వామికి అనేకదానాలు గావించిరి.శక సం.1438, 1441 లలో కృష్ణ దేవరాయలు స్వామిని సేవించాడు. శక సం.1438లో కృష్ణదేవరాయలు చిన్నాదేవీ తిరుమలదేవీ సహితుడై ఇక్కడకేతించి స్వామిని అనేక అలంకార వస్తువులు కైంకర్యంలను అర్పించాడు.అనేక గ్రామాలను సా.శ.1441లో ధారపోసినాడు.

గజపతులు పతనమైన తరువాత కుతుబ్ షాహీ వంశం వారు ఈ ప్రదేశంపై దండెత్తి దేవాలయ సంపదను దోచుకొనినారు.సా.శ.1604లో పద్మనాయక కులుడను విప్పర్ణ గోత్రుడును అగు సర్వప్ప అశ్వరాయుడు స్వామికి నిత్యనైవేద్య రాగభోగాలను పునరుద్ధరించి అవి యవిచ్ఛిన్నంగా జరుగునిమిత్తం నరవ అను గ్రామాన్ని సమర్పించాడు.

మిధ్య యుగాన ఈక్షేత్రం విద్యా కేంద్రమని పెక్కు శాసనాలవలన తెలుస్తుంది.శక సం.1275లో గంగానరసింహ భోగకాలాన పురాణాలు పఠించు బ్రాహ్మణులకు జీతమిచ్చునిమిత్తం శృఈ భంఢారాన 52 మాడలను గంగాదేవి యొసగింనది.శా.సం.1305లో సింహాచల మందలి బ్రాహ్మణులకు వేదం చెప్పుటకు జంపూ మహాసేనాపతి యొడ్య పెద్దిభట్టును నియమించాడు. పురాణ కావ్య నాటక వ్యాకరణ కాండవ తైత్తిరీయశాఖలను బోధించు బ్రాహ్మణులకు అదేవిధంగా నారాయణా సేనాపతి నిబంధంల నిచ్చాడు.

కూచిమంచి తిమ్మకవి (1690-1757) కట్టమూరి కామేశ్వరకవి (1830-90) సింహాచల మాహాత్మ్య శ్రీ లక్ష్మీనృసింహ చరిత్ర అనుపేర పేర రచించిన ప్రబంధం సింహచల మహాత్మ్యం వర్ణించారు. కూచిమంచి తిమ్మకవి 5 అశ్వాసాల కావ్యంగా తెలుగులో రచియించి గౌరీవల్లభునికి అంకితమిచ్చాడు.

ఆలయ విశేషాలు

సింహాచల దేవాలయ సింహ ద్వారం లోపలి నుండి కనిపించే దృశ్యం

గాలి గోపురం-సింహ ద్వారం

సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా, పడమర వైపు ముఖాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే, పడమర ముఖద్వారం విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలి గోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి.

కప్ప స్తంభం

దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైంది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభాన్ని కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం:పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది.

సింహాచలం దేవాలయ వెనుకభాగంలో నరసింహుని విగ్రహం.

సింహాచలం వద్ద గంగధార

జల ధారలు

సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉంది. స్వామి కల్యాణం తరువాత ఈ ఘట్టంలో స్నానం ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉంది.

భైరవ వాక

సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. ఆడివివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్ధాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రాముఖ్యత పొందింది.

కొత్తగా నిర్మించిన విచారణ కార్యాలయం.

వరాహ పుష్కరిణి

వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది.

మాధవధార

  • మాధవస్వామి దేవాలయం ఉంది. గిరిప్రదక్షిణం సమయంలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.

దర్శన వేళలు

  • ఉదయం 6.30 నుంచి 11.30 వరకు సర్వదర్శనం

  • ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు.

  • మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకు సర్వదర్శనం

  • మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు పవళింపు సేవ. దర్శనాలు ఉండవు

  • సాయంత్రం 3 నుంచి రాత్రి 7 వరకు సర్వదర్శనం

  • రాత్రి 7 నుంచి 8.30 వరకు ఆరాధన. దర్శనాలు లభించవు.

  • రాత్రి 8.30 నుంచి 9 వరకు సర్వదర్శనం

  • రాత్రి 9.00 పవళింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు

  • మరలా ఉదయం 6.30కి యథావిధిగా దర్శనాలు లభిస్తాయి.

రవాణా సౌకర్యం

సింహాచలం రైల్వేస్టేషన్

సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌకా, రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కేవలం 11 కి.మీ, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్‌ నుంచి 11 కి.మీ, విశాఖపట్నం బస్‌ స్టేషన్‌ నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. సింహాచలానికి 5 కి.మీల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్‌ కూడా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది. అన్ని చోట్ల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్‌ క్యాబ్‌లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రం సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలను నడుపుతోంది. సొంత వాహనాలు ఉంటే నామమాత్రపు (రూ.10) టోల్‌ రుసుము చెల్లించి ఆ వాహనాల్లోనే చేరుకోవచ్చు. కొండ పైకి చేరుకునేందుకు దేవస్థానం వారు నాలుగు, ఆర్టీసీ వారు 20 బస్సులు నడుపుతున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఇక చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేశారు.

]]>
https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%b5%e0%b0%b0%e0%b0%be%e0%b0%b9-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8d%e0%b0%ae%e0%b1%80%e0%b0%a8%e0%b0%b0%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%b9%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae/feed/ 0
శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%a3%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%a6/ https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%a3%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%a6/#respond Wed, 08 Jan 2025 07:33:54 +0000 https://cnuwyatra.in/?p=797

 

 

శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలో అరసవల్లి అనే గ్రామంలో ఉంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ద్వారా బహుళ ప్రసిద్ధి చెందింది.

ఆలయ విశేషాలు

ఈ దేవాలయం సూర్యనారాయణ స్వామి దేవాలయాలలో ప్రసిద్ధమైంది. ఇది అరసవల్లి లో ఉంది. ఇది శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కి.మీ దూరంలో ఉంది. ఉత్తరాంధ్రలో ఇది ప్రసిద్ధ దేవాలయం. ఇది భారతదేశంలో గల సూర్యదేవాలయాలలో ప్రాచీనమైంది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. ఈ దేవాలయ నిర్మాణం కోసం ద్వాపరయుగం నాటి ఆధారాలు లభిస్తాయి.[2]

ఆలయ చరిత్ర

ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి. ఈఆలయంలో భాస్కరుణ్ణి పూజించిన వారు అన్ని కష్టాలూ తొలగి హర్షంతో వెళతారు కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనే వారనీ అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఈ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని స్ధల పురాణం చెబుతోంది. ఆలయం తొలుత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ ప్రవచనం.

చరిత్ర పుటలను తిరగేస్తే అరసవల్లిలోని శ్రీ సూర్యదేవాలయాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ సా.శ. 545 లో నిర్మించి నట్టు తెలుస్తోంది. ఆ తరువాత అతని వారసుడు ఒకటో దేవేంద్రవర్మ సా.శ. 648 లో సూర్యగ్రహణ సమయాన ఆదిత్య విష్ణుశర్మ, భానుశర్మలనే బ్రాహ్మణులకు అరసవల్లితో పాటు మరికొన్ని గ్రామాలను దానం ఇచ్చినట్టు ఆలయ పరిసరాల్లోని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం సా.శ. 1077- 1150 సంవత్సరాల మధ్య జీవించిన అనంతశర్మ చోడగంగ దేవ రాజు సూర్యదేవునికి, శ్రీకూర్మ నాధునికి కొంతభూమి దానం చేసినట్టు అరసవల్లిలో దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. సా.శ. 1609 నాటి శాసనంలో అరసవల్లిలో ఓ విద్యాలయం విద్యార్థులకు ఉచిత భోజన వసతితోపాటు చెరువు తవ్వకానికి భూదానం చేసినట్టు తెలిపారు. సా.శ. 1434లో తూర్పుగంగ వంశం అంతరించినంత వరకు ఆదిత్యుడికి నిత్య పూజలు కొనసాగించారు.

అరసవల్లిలో సూర్యదేవాలయం నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది. కళింగ దేశ రాజధానిగా శ్రీముఖలింగం ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న, సూరప్ప అనే సోదరులు రాజు దర్శనానికి వెళ్లి, తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్నవించారు. ఆ సోదరుల దైవభక్తిపై ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్యదేవాలయానికి అర్చకులుగా దేవేంద్రవర్మ నియమించినట్టు కొన్ని రచనల ఆధారంగా తెలుస్తోంది. కృష్ణా తీర ప్రాంతానికి చెందిన ఈ సోదరులు శ్రీముఖలింగం వస్తున్నప్పుడు వంశధార నదిలో ఒక తాళపత్ర గ్రంథం దొరికిందని, అందులో సూర్యదేవుని పూజా విధానాలు ఉన్నాయని వారు మహారాజుకు తెలిపినట్టు చరిత్ర చెబుతుంది.

వారి వారసులే ఇప్పటికీ ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు. గంగ వంశరాజులు తరువాత గజపతులు అరసవల్లితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఆలయాలను సంరక్షించారు. సా.శ. 1599 లో హజరత్‌ కులీకుతుబ్‌షా శ్రీ కూర్మం వరకూ దండయాత్ర జరిపి అరసవల్లి ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు సౌత్‌ ఇండియన్‌ ఇన్‌స్క్రిప్షిన్స్‌ 5వ సంపుటం ఆధారంగా తెలుస్తోంది. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి నిజాం నవాబు సుబేదార్ గా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్ తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఒక శాసనంలో చెప్పుకున్నారు. అతని వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు మహమ్మద్ ఖాన్ దండయాత్ర గురించి తెలుసుకుని, ఆలయంలో మూలవిరాట్ ను ఒక బావిలో పడేశారట. సా.శ. 1778 లో ఎలమంచిలి పుల్లాజీ అనే అతను ఆ బావిలో మూలవిరాట్ ను కనుగుని బయటకి తీసి ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ చేసాడు. ఆ సమయానికి నల్లని గ్రానైట్‌ శిలతో రూపొందించిన మూలవిరాట్‌ విగ్రహం తప్ప మరే అవశేషం మిగిలి లేదు. అలా కాలక్రమంలో యిప్పిలి జోగారావు ఆలయ ధర్మకర్తగా ఉన్న సమయంలో సారవకోట మండలం ఆలుదు గ్రామస్ధులైన వరుదు బాబ్జీ దంపతులు ఆలయ వాస్తు నిర్మాణం దెబ్బతినకుండా గర్భగుడిపై విమానాన్ని (గోపురం) పడగొట్టి దక్షిణాది పద్ధతిన కాకుండా ఓఢ్ర (ఒరిస్సా) సంప్రదాయంలో నిర్మించారు.

స్థల పురాణం

కురు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడనొల్లక బలరాముడు తీర్థయాత్ర లకు బయలుదేరాడు. వింధ్య పర్వతాలు దాటి దండకారణ్యం అధిగమింఛి మాధవ వనంలో పద్మనాభ పర్వత ప్రాంతంలో నివసించాడు. కరువు కాటకాలతో బాధపడుచున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముని ప్రార్థింపగా అతను తన ఆయుధమైన హలం (అనగా నాగలి వలన) ని భూమి పై నాటి జలధార వచ్చేటట్లుగా చేసాడు. బలదేవుని ఆయుధమైన నాగావళి ఉధ్బవించినకి కాబట్టి నాగావళి (దీనినే లాంగుల్య నది) అని పిలివబడుతుంది. ఈ నాగావళి నది తీరమందు బలరాముడు ఐదు విశిష్ట శివాలయాలను నిర్మించాడు.[3] అందులో నాలుగవది శ్రీకాకుళం పట్టణంలో వెలసిన ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామివారిని దేవతలందరూ దర్శించుకున్నారు. అదే విధంగా ఇంద్రుడు ఈ మహాలింగాన్ని దర్శించుటకు వచ్చాడు. అప్పటికే కాలాతీతమైంది. పిదప నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, బృంగేశ్వరుడు ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించుటకు ఇది తగిన సమయం కాదని వారించాడు. పిదప ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగాడు. అపుడు నందీశ్వరుడుకు ఆగ్రహం వచ్చి కొమ్ములతొ ఒక విసురువిసిరాడు. ఇంద్రుడు ఆ కొమ్ములవిసురుకు కొంతదూరంలో పడ్డాడు. ఇంద్రుడు పడిన ఆ స్థలంనే ఇంద్ర పుష్కరిణి అంటారు. అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవానుని ప్రార్థించగా ప్రత్యక్షమై “నీవు పడిన చోట నీ వజ్రాయుధంతో త్రవ్వమని” చెప్పాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో త్రవ్వగా అచ్చట సూర్యభగవానుని విగ్రహం దొరికింది.దానితోపాటు ఉష,ఛాయ, పద్మిని విగ్రహాలు కూడా లభించాయి. అచ్చట ఇంద్రుడు దేవాలయం కట్టి సూర్యభగవానుని ప్రతిష్ఠించాడు అని పురాణ కథనం. అదే ఈ నాటి అరసవెల్లి క్షేత్రం. అనంతరం శ్రీఉమారుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జన్మ పునీతం చేసుకొన్నాడు.

విశిష్టత

ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకుతాయి. అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి. ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబరు 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి.

ఆలయ దర్శన సమయాలు

సర్వదర్శనం,ఇతర కార్యక్రమాలు

  • ఉదయం 6.00 గం.ల. నుండి 12.30 గం.ల. వరకు

  • సాయత్రం 3.30 గం.ల. నుండి రాత్రి 8.00 గం. వరకు

  • సుప్రభాతం – ఉదయం 5 గం.కు

  • నిత్య అర్చన – ఉదయం 5.30 గం.కు

  • మహానివేదన – మధ్యాహ్నం 12.30 గం.కు

ఆలయానికి చేరుకొనే మార్గాలు

బస్సు ద్వారా

శ్రీకాకుళం జిల్లా ముఖ్య కేంద్రమైన శ్రీకాకుళానికి అన్ని ప్రాంతాలనుండి విరివిగా బస్సులు లభిస్తాయి. విశాఖపట్నం నుండి ప్రతి 30 నిమిషాలకు నాన్‌స్టాప్ బస్సు సౌకర్యం ఉంది.

రైలు ద్వారా

శ్రీకాకుళానికి సుమారు 13 కి.మీ దూరంలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇచట అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్ళు కూడా ఆగుతాయి. ఈ రైల్వే స్టేషను నుండి విరివిగా బస్సులు శ్రీకాకుళానికి ఉంటాయి. నేరుగా అరసవిల్లి వద్దకు చేరుకోవచ్చు.

విమానం ద్వారా

శ్రీకాకుళానికి సుమారు 106 కి.మీ దూరంలో విశాఖపట్నంలో విమానాశ్రయం ఉంది. అక్కడి నుండి బస్సుల ద్వారా శ్రీకాకుళం చేరుకోవచ్చు.

]]>
https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%a3%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%a6/feed/ 0
శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%95%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a8%e0%b0%be%e0%b0%a5%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%b8/ https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%95%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a8%e0%b0%be%e0%b0%a5%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%b8/#respond Wed, 08 Jan 2025 07:25:37 +0000 https://cnuwyatra.in/?p=792

శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం శ్రీకాకుళం నుండి 15 కి.మీ. దూరానగల శ్రీకూర్మం గ్రామంలో ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీరామానుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు.

స్థలపురాణము

శ్రీకూర్మం లోని ఆలయ ముఖద్వారము

శ్రీకాకుళం, గార మండలంలో ఉన్న ఆలయం 2 వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలా మంది నమ్ముతారు. నిజానికి ఆలయము నిర్మించిన వారు ఇప్పటికీ తెలియదు. అయితే, ఈ ఆలయం చోళ, కళింగ రాజా రాజవంశం సమయంలో అభివృద్ధి చేశారు.7 వ శతాబ్దం నుండి ఈ ఆలయం ప్రాముఖ్యత తెలుసునని ఉంది.తరువాత ఈ ప్రాంతాన్నిపాలించిన వివిధ రాజవంశాలు వివిధ దశలలో అభివృద్ధి చేశారు. ఎక్కువగా కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశం పాలనలో చేశారు. దేవాలయ మొత్తం నిర్మాణంలో గాంధర్వ శిల్ప సంపాద అని పిలవబడే స్తంభాలు ఈ రాజవంశాల పేరు, కీర్తిని చాటి చెప్తాయి. గంగరాజ రాజవంశం యొక్క వారసుడు అనంగభీముడు ఆలయం చుట్టూ నేల, పైభాగాన్ని నిర్మించారు.

దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను. అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండబెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామీ! అటు నా భర్తను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధముల వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేసెను. ఆ గంగ మహా ఉదృతంగా రాజు వేపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతము మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా, ఆతను రాజుకు విషయమంతా వివరించెను.

అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపమునకు ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను. ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను. రాజు వంశధారలో స్నానమాచరించి, అక్కడే వెలసి ఉన్న జ్ఞానేశ్వరుని, సోమేశ్వరుని పూజించి, ఘోర తపస్సు చేసినా, మహానిష్ణువు కరుణించలేదు. అప్పుడు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజుకు దర్శనమివ్వవలసిందిగా కోరగా శ్రీమహావిష్ణువు, కూర్మావతారంలో చక్రతీర్థగుండము నుండి వెలువడి, శ్వేతమహారాజుకు దర్శనమిచ్చెను. స్వామి నాలుగు చేతులతో, శంఖము, చక్రము, గద, పద్మములు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడి అక్కడ కొలువై ఉండుమని ప్రార్ధింపగా శ్రీమహావిష్ణువు కొలువై ఉండేందుకు తనకు తగిన మంచి స్థానమునకై రాజు, నారదునితో కలసి ఒక వటవృక్షము వద్దకు వచ్చి, ఆవృక్షముపై చక్ర ప్రయోగము చేసెను. అక్కడ క్షీర సమానమైన జలము ఉద్భవించెను. ఈ గుండమునే కూర్మగుండము లేక శ్వేత గుండము అంటారు. చక్రము వెళ్ళిన మార్గము నుండి శ్రీమహాలక్ష్మి ప్రత్యక్షమై, స్వామివారి వామభాగములో వసించెను. అంత శ్రీకూర్మనాధుడు లక్ష్మీ సమేతుడై అక్కడనే నిత్యనివాసమేర్పరుచుకొనెను.

ఒకనాడు అటుగా వచ్చిన ఒక కిరాత స్త్రీ కూర్మగుండములో దాహముతీర్చుకొని, శ్రీకూర్మనాథుని దర్శించుకొని, తన భర్త అయిన భిల్లురాజుకు ఈ విషయము తెలుపగా, ఆతను వచ్చి చూడగా ఆ గుండముపైన చక్రాకారములో తేజము కనుపించెను. ఆ వెలుగు క్రమముగా కూర్మనాథుని ఆకృతిని దాల్చెను. భిల్లురాజు ఆశ్చర్యముగా ఆ స్వామిని చూస్తూ, మహాపురుషుడా లేక ఏదైనా విచిత్ర జలచరమా అని ఆలోచిస్తుండగా, అక్కడకు వచ్చిన శ్వేతమహారాజు, నీ పూర్వపుణ్యమున శ్రీమన్నారాయణుడు, కూర్మరూపములో నీకు సులభముగానే దర్శనమిచ్చాడు అని చెప్పెను. అంత భిల్లురాజు సంతోషముతో స్వామిని పూజించెను. స్వామి సంతోషించి, భిల్లురాజును కూర్మగుండమునకు కట్టడము, సోపానములు కట్టించవలసిందిగానూ, శ్వేతమహారాజును దేవాలయ నిర్మాణము గావించవలసిందిగానూ ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. భిల్లురాజును, స్వామి, పశ్చిమదిక్కుగా సదంగ మహాముని ఆశ్రమ సమీపములో నివాసమేర్పరుచుకోమని ఆజ్ఞాపించెను. అంతట భిల్లురాజు, తనవైపు ఎల్లప్పుడూ కరుణాదృష్టితో చూస్తూ ఉండమని స్వామిని వేడుకొనెను. శ్రీకూర్మనాథుడు అట్లే ఆభిల్లురాజుకు వరమిచ్చెను. అప్పటినుండి స్వామి పశ్చిమాభిముఖుడుగా తిరిగెను.

ఒకనాడు నారదుడు కూర్మనాథుని సేవించుటకు రాగా, శ్వేతమహారాజు, స్వామిని అర్చారూపమున ఆరధించుటకు ఏ మంత్రముతో ప్రతిష్ఠించవలెనని అడిగెను. అంతట నారదుడు, బ్రహ్మదేవుని కోరగా బ్రహ్మదేవుడే శ్రీకూర్మనాథుని, సుదర్శన మంత్రముతో ప్రతిష్ఠించెను. అప్పుడు స్వామి అగ్నిజ్వాలలచే భయంకరముగా ప్రకాశిస్తున్న శ్రీకూర్మనాథుని చూసి దేవతలందరూ భయకంపితులైరి. అప్పుడు శ్వేతమహారాజు, స్వామిని, గోపాలమంత్రంతో ప్రతిష్ఠించవలసిందిగా బ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు అట్లే శ్రీకూర్మనాథుని గోపాలమంత్రంతో పునహ ప్రతిష్ఠచేసెను. అప్పుడు స్వామి శాంతరూపములో దర్శనమిచ్చి, తనకు నారాయణ మంత్రముతో అభిషేకము, సంకర్షణ మంత్రముతో వస్త్ర సమర్పణ, వాసుదేవ మంత్రముతో ఏక హారతి, అనంత మంత్రముతో ధూపము, పద్మనాభ మంత్రముతో పంచహారతి సమర్పించవలెనని బ్రహ్మకు చెప్పగా, బ్రహ్మ స్వామిని అట్లే ఆరాధించెను. శ్రీకూర్మనాథుడే ప్రాకారాది దేవతా స్థాపనకు ఆజ్ఞనిస్తూ, తూర్పున పార్వతీ సమేతంగా శివుని, ఆగ్నేయమున నరశింహుని, దక్షణమున గోపాలమూర్తిని, నైరుతి దిక్కున వైకుంఠనాథుని, వాయవ్యమున వైష్ణవీ దుర్గను, ఆమెకు ముందు భాగమున విశ్వక్షేసులను, తరువాత అనంతుని స్థాపించమనగా, బ్రహ్మ అట్లే చేసెను.

తిలోత్తమ స్వర్గము నుండి శ్రీకూర్మనాథుని పూజించుటకు వచ్చి అక్కడనే ఉండిపోయింది. బ్రహ్మ, స్వామికి నివేదించిన ప్రసాదము ఆమెకు లభించకపోవుటచే దుఖితురాలై, వక్రాంగ మహామునిని ఆశ్రయించగా, ఆయన, తిలోత్తమకు నారశింహమంత్రమును ఉపదేశించెను. ఆమె ఆమంత్రముతో తపమాచరించగా, ఆమె కాలిబొటనవ్రేలు దగ్గర ఒక గుండమేర్పడింది. అందుండి, శ్రీకూర్మనాథుడు, నరశింహరూపమున ఉద్భవించి, ఆమెకు దర్శనమిచ్చెను. తిలోత్తమ ఆనందంతో స్వామిని అక్కడ అట్లే వెలయవలసిందిగా కోరగా స్వామి అక్కడ అలాగే వెలసెను. ఆకుండము, నరసింహతీర్థమని, అక్కడ వెలసిన స్వామి, పాతాళ నరసింహుడని అందురని స్వామి చెప్పెను. అంత తిలోత్తమ తనకు ప్రసాదము లభించలేదని వివరించగా స్వామి ఆమె భక్తికు మెచ్చి, తన ప్రసాదముపై శాశ్వత ఆధిపత్యమును ఆమెకు ప్రసాదించెను. అప్పటినుండి స్వామివారి ప్రసాదమును తిలోత్తమే అందరికీ పంచేదట.

పద్మపురాణము లోని శ్వేతగిరి మహత్యమను 30 అధ్యాయములో చెప్పబడిన విశేషముల ప్రకారము

శ్రీకూర్మక్షేత్రమునకు వంశధారానదీ తీరములో శ్రీకూర్మశైలమను పర్వతము ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాడ్రూపమని నమ్మకము. క్షేత్రమునకు దక్షిణమున ప్రేతశిల అను పర్వతముంది. ఇక్కడ కౌటిల్యతీర్థముంది. ఈ తీర్థములో స్నానమాచరించి, ప్రేతశిల యందున్న విష్ణుపాదాలపై పిండప్రదానము చేసి కౌటిల్య తీర్థములో పితృతర్పణము చేసిన గయలో శ్రాద్ధము వలన కలుగు ఫలమే లభంచును.ఇక్కడ ఉన్న అష్టతీర్థములందు స్నానముచేసి, శ్రీకూర్మనాథుని కొలుచుట ఒక ఆచారముగా వస్తున్నది. ఇక్క డ ఉన్న చక్రతీర్థము, నారదతీర్థము, కౌటిల్యతీర్థము, మాధవతీర్థము, నరసింహతీర్థము, కూర్మతీర్థము, వంశధార నది, లాంగలీనది, సముద్రములో మూడురోజులుగానీ, ఎనిమిదిరోజులు గానీ ఈ క్షేత్రములో ఉండి, స్నానములాచరిస్తూ, స్వామిని కొలుచుట ఒక ఆచారము.

ఈ శ్రీకూర్మక్షేత్రము పంచలింగారాధ్యక్షేత్రము (ఐదుగురు శివులు క్షేత్రపాలకులుగా ఉన్న క్షేత్రము) తూర్పున వంశధారాసాగర సంగమ ప్రదేశములో కళింగ పట్టణములో కర్పూరేశ్వరుడు, ఉత్తరమున సింధూర పర్వతమున (సింగుపురపుకొండ) హటకేశ్వరుడు, పశ్చిమమున నాగావళీ తీరమున శ్రీకాకుళ పట్టణములో కోటీశ్వరుడు, ఉత్తరమున (పిప్పల) ఇప్పిలి గ్రామమున సుందరేశ్వరుడు, శ్రీకూర్మక్షేత్రమున సుధాకుండతీరమున సిద్ధేశ్వరుడు వేంచేసి ఉన్నారు. శ్రీకూర్మక్షేత్ర ముఖద్వారమున భైరవుడు, ఆలయ ప్రాకారమున అష్టదిక్పాలురును క్షేత్రపాలకులై స్వామిని సేవిస్తున్నారు.

ఆలయ విశిష్టత

ఈ ఆలయం యొక్క పెద్ద ప్రాకారా నికి వెలుపల ‘శ్వేత పుష్కరిణి’ ఉంది. క్రీస్తు శకం నాలుగో శతాబ్ది నాటికే ఈ ఆలయం ఇక్కడ ఉందని చారిత్రిక ఆధారాలు స్పష్టం చేస్తు న్నాయి. ఈ ఆలయంలోని ప్రతీ శిల్పం ఒక అపూరూప కళాఖండంగా చెప్పవచ్చు. ఎంతో మంది రాజులు వేసిన శిలాశాసనాలు శిథిలమై పోకుండా ఇప్పటికీ లభిస్తాయి. ఇవి కళింగాంధ్ర చరిత్రకు అమూల్యా ధారాలుగా నిలుస్తాయి. అత్యద్భుతమైన వాస్తు కళతో ఆలయం అలరా రుతూ ఉంటుంది. ఈ ఆలయ మండపంలోని 108 రాతి స్తంభాలు అన్నీ ఏకశిలతో రూపు దిద్దుకున్నవే. ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటిని శిల్పులు అత్యంత రమ ణీయంగా మలిచారు.[1]

ప్రతీ ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలవిరాట్‌ ఉంటే ఈ ఆలయంలో మాత్రం గర్భ గుడిలో ఎడమవైపు గోడ మూలగా శ్రీకూర్మనాధుని ఆవతారంలో శ్రీమహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరి స్తారు. భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు, ఐదడు గుల పొడవు, నాలుగడుగులు వెడల్పు కొలతలు గల రాతిపీఠం పై కూర్మనాథస్వామి దర్శనమిస్తారు. రెండున్నర అడుగుల పొడవు, అడుగు ఎత్తులో మొదట తల మధ్యలో శరీరం చివరిగా పశ్చిమా భిముఖంగా తోకతో మూడు భాగాలుగా శ్రీకూర్మం కన్పిస్తుంది. మధ్య తక్కు వ ఎత్తులో శిరస్సుకలిపి ఒకటిగా కన్పిస్తా యి. చివర తాటిపండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది. విగ్రహమంతా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరి స్తారు. గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైనా ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామిని దర్శించుకోవచ్చు.

శ్రీ కూర్మనాథస్వామి ఆలయం.

బలరాముని శాపం

ఆలయంలో శ్రీకూర్మనాథుని విగ్రహం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తూ ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమారుద్రకోటేశ్వర లింగ ప్రతిష్ఠ చేసిన బలరాముడు శ్రీకూర్మం వచ్చాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతనిని అడ్డగిం చాడు. దాంతో అతడు భైరవుని పై ఆగ్రహంతో ఆతనిని గిరగిరా తిప్పి విసిరేశాడు. ఇది తెలిసిన కూర్మనాధ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. ఆయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో ఆగ్రహాగ్ని చల్లారని బలరాముడు ‘కూర్మావతారం’లో ఆలయం భూమి పై మరెక్కడా ఉండకూడదని శపించాడు. అందువల్లే ప్రపంచంలోనే ఇది ఏకైక కూర్మనాధస్వామి ఆలయంగా విరాజిల్లుతోంది. ఈఆలయా నికి రెండు ధ్వజ స్తంభాలు ఉండడం మరో ప్రత్యేకత. శ్రీకూర్మంలోని పుష్కరిణి అడుగుభాగం నీరుతో కలిసిన మట్టి తెల్లగా తళతళలాడుతూ ఉండడం విశేషం. ఒక మహర్షికి శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణీలో జలక్రీడలాడుతూ కన్పించాడట. అందు వల్లే ఆ పుష్క రిణిలోని మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనిని ‘గోపీ చందనం’ అని కూడా అంటారు.

పుణ్యక్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణలు

  • కూర్మ, విష్ణు, పద్మ, బ్రహ్మాండ పురాణాలలో మూలాలు.

  • మహావిష్ణువు కూర్మావతారము రూపంలో పూజ్యమైన ప్రపంచంలో ఏకైక స్వయంభు ఆలయం (తాబేలు) అవతారం.

  • విష్ణు ప్రముఖ దశావతారాలలో 2 వ అవతారం.

  • విగ్రహం పశ్చిమ ముఖంగా ఉంది, రెండు ద్వజస్థంబాలతో ప్రపంచంలో ఉన్న కొన్ని దేవాలయాలులో ఒకటి.

  • రోజువారీ అభిషేకం నిర్వహించే ప్రపంచంలో కొన్ని విష్ణు దేవాలయాలులో ఒకటి.

  • అజంతా ఎల్లోరా గుహలు మాదిరిగా శతాబ్దాల అరుదైన కుడ్య చిత్రాలతో ఉన్న దేవాలయాలులో ఒకటి.

  • దుర్గా మాత వైష్ణోదేవి రూపంలో ఉన్న ప్రపంచ రెండవ ఆలయం., ఇతర వైష్ణోదేవి ఆలయం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది.

  • దీని శిఖరం రాతి శిల్పం – గాంధార శిల్పకళా అని అంటారు., ఇతర స్తంభాలతో పోలిక లేకుండా కొన్ని స్తంభాలు క్రింద వృథాగా లేకుండా పైకప్పు నిర్మాణానికి వేలాడుతూ అద్భుతంగా చెక్కిన 108 రాతి స్తంభాలు ఉన్నాయి.

  • వారణాసి (కాశి) వెల్లడానికి సొర్ంగ మార్గం ఉంది, ప్రస్తుతం దీన్ని మూసివేసారు.

  • వారణాసి / పూరీ (ఒడిషా) ల వలె, మరణించినవారి అంతిమ కర్మలు, మోక్ష స్థానం ఇక్కడ నిర్వహిస్తారు .

  • ఆది శంకరాచార్య, రామానుజాచార్య, నరహరి తీర్థ, చైతన్య మహా ప్రభు అనేక గొప్ప రాజులు, సెయింట్స్ ఋషులు దేవాలయాన్ని సందర్శించారు .–కె.యల్.రావు

ప్రయాణ సదుపాయం

శ్రీకాకుళం పట్టణం పాత బస్ స్టాండు నుండి ప్రతి 15 నిమిషాలకు అరసవిల్లి మీదుగా ఆర్టిసి వారి బస్సులు ఉన్నాయి.ఉదయం 6.00గంటలనుండి, రాత్రి 8.00గంటల వరకు నడుస్తాయి.అంతేకాక ఆటోలు, టాక్సిలు ఉన్నాయి.వసతి మాత్రం శ్రీకాకుళం పట్టణం లోనే..

స్థలపురాణము

శ్రీకూర్మం లోని ఆలయ ముఖద్వారము

శ్రీకాకుళం, గార మండలంలో ఉన్న ఆలయం 2 వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలా మంది నమ్ముతారు. నిజానికి ఆలయము నిర్మించిన వారు ఇప్పటికీ తెలియదు. అయితే, ఈ ఆలయం చోళ, కళింగ రాజా రాజవంశం సమయంలో అభివృద్ధి చేశారు.7 వ శతాబ్దం నుండి ఈ ఆలయం ప్రాముఖ్యత తెలుసునని ఉంది.తరువాత ఈ ప్రాంతాన్నిపాలించిన వివిధ రాజవంశాలు వివిధ దశలలో అభివృద్ధి చేశారు. ఎక్కువగా కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశం పాలనలో చేశారు. దేవాలయ మొత్తం నిర్మాణంలో గాంధర్వ శిల్ప సంపాద అని పిలవబడే స్తంభాలు ఈ రాజవంశాల పేరు, కీర్తిని చాటి చెప్తాయి. గంగరాజ రాజవంశం యొక్క వారసుడు అనంగభీముడు ఆలయం చుట్టూ నేల, పైభాగాన్ని నిర్మించారు.

దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను. అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండబెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామీ! అటు నా భర్తను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధముల వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేసెను. ఆ గంగ మహా ఉదృతంగా రాజు వేపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతము మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా, ఆతను రాజుకు విషయమంతా వివరించెను.

అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపమునకు ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను. ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను. రాజు వంశధారలో స్నానమాచరించి, అక్కడే వెలసి ఉన్న జ్ఞానేశ్వరుని, సోమేశ్వరుని పూజించి, ఘోర తపస్సు చేసినా, మహానిష్ణువు కరుణించలేదు. అప్పుడు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజుకు దర్శనమివ్వవలసిందిగా కోరగా శ్రీమహావిష్ణువు, కూర్మావతారంలో చక్రతీర్థగుండము నుండి వెలువడి, శ్వేతమహారాజుకు దర్శనమిచ్చెను. స్వామి నాలుగు చేతులతో, శంఖము, చక్రము, గద, పద్మములు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడి అక్కడ కొలువై ఉండుమని ప్రార్ధింపగా శ్రీమహావిష్ణువు కొలువై ఉండేందుకు తనకు తగిన మంచి స్థానమునకై రాజు, నారదునితో కలసి ఒక వటవృక్షము వద్దకు వచ్చి, ఆవృక్షముపై చక్ర ప్రయోగము చేసెను. అక్కడ క్షీర సమానమైన జలము ఉద్భవించెను. ఈ గుండమునే కూర్మగుండము లేక శ్వేత గుండము అంటారు. చక్రము వెళ్ళిన మార్గము నుండి శ్రీమహాలక్ష్మి ప్రత్యక్షమై, స్వామివారి వామభాగములో వసించెను. అంత శ్రీకూర్మనాధుడు లక్ష్మీ సమేతుడై అక్కడనే నిత్యనివాసమేర్పరుచుకొనెను.

ఒకనాడు అటుగా వచ్చిన ఒక కిరాత స్త్రీ కూర్మగుండములో దాహముతీర్చుకొని, శ్రీకూర్మనాథుని దర్శించుకొని, తన భర్త అయిన భిల్లురాజుకు ఈ విషయము తెలుపగా, ఆతను వచ్చి చూడగా ఆ గుండముపైన చక్రాకారములో తేజము కనుపించెను. ఆ వెలుగు క్రమముగా కూర్మనాథుని ఆకృతిని దాల్చెను. భిల్లురాజు ఆశ్చర్యముగా ఆ స్వామిని చూస్తూ, మహాపురుషుడా లేక ఏదైనా విచిత్ర జలచరమా అని ఆలోచిస్తుండగా, అక్కడకు వచ్చిన శ్వేతమహారాజు, నీ పూర్వపుణ్యమున శ్రీమన్నారాయణుడు, కూర్మరూపములో నీకు సులభముగానే దర్శనమిచ్చాడు అని చెప్పెను. అంత భిల్లురాజు సంతోషముతో స్వామిని పూజించెను. స్వామి సంతోషించి, భిల్లురాజును కూర్మగుండమునకు కట్టడము, సోపానములు కట్టించవలసిందిగానూ, శ్వేతమహారాజును దేవాలయ నిర్మాణము గావించవలసిందిగానూ ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. భిల్లురాజును, స్వామి, పశ్చిమదిక్కుగా సదంగ మహాముని ఆశ్రమ సమీపములో నివాసమేర్పరుచుకోమని ఆజ్ఞాపించెను. అంతట భిల్లురాజు, తనవైపు ఎల్లప్పుడూ కరుణాదృష్టితో చూస్తూ ఉండమని స్వామిని వేడుకొనెను. శ్రీకూర్మనాథుడు అట్లే ఆభిల్లురాజుకు వరమిచ్చెను. అప్పటినుండి స్వామి పశ్చిమాభిముఖుడుగా తిరిగెను.

ఒకనాడు నారదుడు కూర్మనాథుని సేవించుటకు రాగా, శ్వేతమహారాజు, స్వామిని అర్చారూపమున ఆరధించుటకు ఏ మంత్రముతో ప్రతిష్ఠించవలెనని అడిగెను. అంతట నారదుడు, బ్రహ్మదేవుని కోరగా బ్రహ్మదేవుడే శ్రీకూర్మనాథుని, సుదర్శన మంత్రముతో ప్రతిష్ఠించెను. అప్పుడు స్వామి అగ్నిజ్వాలలచే భయంకరముగా ప్రకాశిస్తున్న శ్రీకూర్మనాథుని చూసి దేవతలందరూ భయకంపితులైరి. అప్పుడు శ్వేతమహారాజు, స్వామిని, గోపాలమంత్రంతో ప్రతిష్ఠించవలసిందిగా బ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు అట్లే శ్రీకూర్మనాథుని గోపాలమంత్రంతో పునహ ప్రతిష్ఠచేసెను. అప్పుడు స్వామి శాంతరూపములో దర్శనమిచ్చి, తనకు నారాయణ మంత్రముతో అభిషేకము, సంకర్షణ మంత్రముతో వస్త్ర సమర్పణ, వాసుదేవ మంత్రముతో ఏక హారతి, అనంత మంత్రముతో ధూపము, పద్మనాభ మంత్రముతో పంచహారతి సమర్పించవలెనని బ్రహ్మకు చెప్పగా, బ్రహ్మ స్వామిని అట్లే ఆరాధించెను. శ్రీకూర్మనాథుడే ప్రాకారాది దేవతా స్థాపనకు ఆజ్ఞనిస్తూ, తూర్పున పార్వతీ సమేతంగా శివుని, ఆగ్నేయమున నరశింహుని, దక్షణమున గోపాలమూర్తిని, నైరుతి దిక్కున వైకుంఠనాథుని, వాయవ్యమున వైష్ణవీ దుర్గను, ఆమెకు ముందు భాగమున విశ్వక్షేసులను, తరువాత అనంతుని స్థాపించమనగా, బ్రహ్మ అట్లే చేసెను.

తిలోత్తమ స్వర్గము నుండి శ్రీకూర్మనాథుని పూజించుటకు వచ్చి అక్కడనే ఉండిపోయింది. బ్రహ్మ, స్వామికి నివేదించిన ప్రసాదము ఆమెకు లభించకపోవుటచే దుఖితురాలై, వక్రాంగ మహామునిని ఆశ్రయించగా, ఆయన, తిలోత్తమకు నారశింహమంత్రమును ఉపదేశించెను. ఆమె ఆమంత్రముతో తపమాచరించగా, ఆమె కాలిబొటనవ్రేలు దగ్గర ఒక గుండమేర్పడింది. అందుండి, శ్రీకూర్మనాథుడు, నరశింహరూపమున ఉద్భవించి, ఆమెకు దర్శనమిచ్చెను. తిలోత్తమ ఆనందంతో స్వామిని అక్కడ అట్లే వెలయవలసిందిగా కోరగా స్వామి అక్కడ అలాగే వెలసెను. ఆకుండము, నరసింహతీర్థమని, అక్కడ వెలసిన స్వామి, పాతాళ నరసింహుడని అందురని స్వామి చెప్పెను. అంత తిలోత్తమ తనకు ప్రసాదము లభించలేదని వివరించగా స్వామి ఆమె భక్తికు మెచ్చి, తన ప్రసాదముపై శాశ్వత ఆధిపత్యమును ఆమెకు ప్రసాదించెను. అప్పటినుండి స్వామివారి ప్రసాదమును తిలోత్తమే అందరికీ పంచేదట.

పద్మపురాణము లోని శ్వేతగిరి మహత్యమను 30 అధ్యాయములో చెప్పబడిన విశేషముల ప్రకారము

శ్రీకూర్మక్షేత్రమునకు వంశధారానదీ తీరములో శ్రీకూర్మశైలమను పర్వతము ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాడ్రూపమని నమ్మకము. క్షేత్రమునకు దక్షిణమున ప్రేతశిల అను పర్వతముంది. ఇక్కడ కౌటిల్యతీర్థముంది. ఈ తీర్థములో స్నానమాచరించి, ప్రేతశిల యందున్న విష్ణుపాదాలపై పిండప్రదానము చేసి కౌటిల్య తీర్థములో పితృతర్పణము చేసిన గయలో శ్రాద్ధము వలన కలుగు ఫలమే లభంచును.ఇక్కడ ఉన్న అష్టతీర్థములందు స్నానముచేసి, శ్రీకూర్మనాథుని కొలుచుట ఒక ఆచారముగా వస్తున్నది. ఇక్క డ ఉన్న చక్రతీర్థము, నారదతీర్థము, కౌటిల్యతీర్థము, మాధవతీర్థము, నరసింహతీర్థము, కూర్మతీర్థము, వంశధార నది, లాంగలీనది, సముద్రములో మూడురోజులుగానీ, ఎనిమిదిరోజులు గానీ ఈ క్షేత్రములో ఉండి, స్నానములాచరిస్తూ, స్వామిని కొలుచుట ఒక ఆచారము.

ఈ శ్రీకూర్మక్షేత్రము పంచలింగారాధ్యక్షేత్రము (ఐదుగురు శివులు క్షేత్రపాలకులుగా ఉన్న క్షేత్రము) తూర్పున వంశధారాసాగర సంగమ ప్రదేశములో కళింగ పట్టణములో కర్పూరేశ్వరుడు, ఉత్తరమున సింధూర పర్వతమున (సింగుపురపుకొండ) హటకేశ్వరుడు, పశ్చిమమున నాగావళీ తీరమున శ్రీకాకుళ పట్టణములో కోటీశ్వరుడు, ఉత్తరమున (పిప్పల) ఇప్పిలి గ్రామమున సుందరేశ్వరుడు, శ్రీకూర్మక్షేత్రమున సుధాకుండతీరమున సిద్ధేశ్వరుడు వేంచేసి ఉన్నారు. శ్రీకూర్మక్షేత్ర ముఖద్వారమున భైరవుడు, ఆలయ ప్రాకారమున అష్టదిక్పాలురును క్షేత్రపాలకులై స్వామిని సేవిస్తున్నారు.

]]>
https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%95%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a8%e0%b0%be%e0%b0%a5%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%b8/feed/ 0
కోణార్క సూర్యదేవాలయం https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%95%e0%b1%8b%e0%b0%a3%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95-%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%af%e0%b0%82/ https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%95%e0%b1%8b%e0%b0%a3%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95-%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%af%e0%b0%82/#respond Wed, 08 Jan 2025 06:45:29 +0000 https://cnuwyatra.in/?p=788
  • 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం, ఒడిషా ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు.

    ఆలయ విశేషాలు

    Konark Sun Temple

    గంగావంశానికి చెందిన లాంగులా నరసింహదేవ I (సా.శ. 1236-1264) లో నిర్మించాడు. ఈ రాజా లాంగులా నరసింహదేవుడు రాజా అనంగభీముని కుమారుడు. సూర్య భక్తుడు. ఈ మందిరము ఎత్తు 230 అడుగులు. ఈ నిర్మాణమునకు విచిత్రమైన పౌరాణిక కథకూడా ఉంది. దీనినే మైత్రేయవన మనిఅందురు. ఉత్కళంలో ఇదే పద్మక్షేత్రం. సూర్య భగవానుడికి ఇక్కడనే ఉపాసన జరిగేది. అదెట్లనగా: శ్రీకృష్ణుని కుమారుడగు సాంబుడు ఒకనాడు నీళ్ళరేవులో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూసాడని తండ్రి అతడిని శాపించినాడట. తండ్రిశాపం వల్ల సాంబుడు కుష్టురోగి పీడితుడై ఈ మైత్రేయవనంలో చంద్రభాగాతీరాన సూర్యారాధనచేసి రోగవిముక్తుడయ్యడట. ఆపవిత్రతను బట్టి సాంబుడు సూర్య ప్రతిమను స్థాపించి ఈమందిరాన్ని కట్టించాడట. మరొక విచిత్రం పద్మ పురాణంలో ఉంది. స్వయం సూర్యభగవానుడే ఇచ్చట తపస్సు చేసాడనీ, అందుకే ఈమందిరానికి పవిత్రత కలిగినదట. ఒడిషా లోని పుణ్యక్షేత్రాల్లో శంఖక్షేత్రం (పూరి), చక్రక్షేత్రం (భువనేశ్వరం), గదాక్షేత్రం (జాజ్ పూర్), ఈ పద్మక్షేత్రం ప్రస్సిధమైనవి.ఈ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రంమైనది, ఇచ్చోటనే భక్త కబీరుదాసు సమాధి ఉండెనని అబుల్ఫజల్ యొక్క అయినీ అక్బరీ చెప్పుతోంది. దీనికి నల్ల పగోడా అనికూడా అంటారు.దీనిని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.

    మందిర వర్ణన

    ఈ దేవాలయం, మొగసాల (An entrance hall)- రెండూనూ పీఠంపైన రథం లాగా చెక్కిఉంది. పీఠంలో 24 చక్రాలు, ఒక్కొక్కచక్రం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మొగసాలసమ్ముఖంలో ఏడుగుర్రాలు. శాస్త్రోక్తంగా సూర్యభగవానుడు సప్తాశ్వరధారూఢుడై ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాడు. అవన్ని ఇప్పుడు అంతగాలేవు. ఒరిసా దేవాలయములు నాలుగురకాలు: రేఖ, భద్ర, ఖఖారా, గౌరీయ. ఈదేవాలయమును, పూరి భువనేశ్వరాలయాలును రేఖా దేవాలయములు. కోణార్కము ఐదు రథాలమందిరము. మందిరం మధ్యభాగములో సుచారుకారు ఖచితమగు సింహాసనమొకటున్నది. దానిపైనసూర్యభగవానుడు. దేవాలయముతోపాటు మొగసాల ఒక తామరపూవు మీద చెక్కివున్నది. మొగసాలకు నాల్గువైపులా ద్వారాలు. ఎంతో చక్కగా లలితకళలాగు రాయిమీద సుత్తిపెట్టిచెక్కివున్నది. ఆశ్రేణీలు, తామరపువ్వులు, లతలు అవన్నీ చూస్తే రమ్యముగా ఉండును. మొగసాలమ్ముఖాన మోరొక స్వతంత్రపీఠం మీద “నాట్యమందిరం” నిర్మింపబడిఉన్నది. దీనిని కొందరు భొగమంటపమని, మరికొందరు నాట్యమందిరమని అంటారు. ఎచటా అశ్లీలాలు లేవు. అన్నివైపులా నర్తకులు భాజభజంత్రీలతో దేవార్చంబచేయటం కనబడుతోంది. ఆభంగిమలు ఈనాటి భరతనాట్యకళా ప్రదర్శకులు అనుకరించటానికి ఎంతో అనుకూలమని చెప్పవచ్చును. అంతేకాదు ఈ నాట్యమందిరము తామరపువ్వులతో నిండి ఉంది. దేవార్చనకు, భూషణానికి ప్రాచీనులు ఈపువ్వులనే వాడేవారు.

    ఈనాట్యమందిరం దగ్గిరగా ఒక పెద్దబండరాయి క్రిందపడి ఉంది. దానిమీద పెద్ద తామరపువ్వు చెక్కబడివున్నది. పూవు వ్యాసము 5 అడుగులు. పూదళాలు అప్సరసలు గానాభజానా చేస్తున్నత్లు కనిపిస్తారు. కేద్రంలో కూడా ఒక చిన్నపువ్వు. దీనిలో సూర్యభగవానుడు సప్తాశ్వరధారూఢుడై కూర్చొని ఉన్నాడు. ఇరువైపులా పరిచారికలు. చేతుల్లో పువ్వులు. శిల్పి ఎంత సూక్షంగా, రసవంతంగా చెక్కినాడో! ఈరాయి నాట్యమందిరం యొక్క గర్భముద్ర అని చెప్పుతారు.

    మొగసాలకు ఉతారంవైపుగా ఉన్న రెండు ఏనుగు విగ్రహాలు ఉనాయి. అవి నిజం ఏనుగులా అన్నట్లు చెక్కినారు. ఏనుగు పొడవు 9 అడుగులు వెడల్పు 5 అడుగులు, ఎత్తు 9 అడుగులు. మొగసాలకు దక్షిణం వైపు విరాట్ స్వరూపంతో రెండు గుర్రాలుండేవి. ఇప్పుడవిలేవు. వాటి వీరావేశం, ఉన్మత్తభావాలను చూస్తే దర్శకులు భయపడేవారుట. వీటి పొడవు 10 అడుగులు, వెడల్పు 6 అడుగులు.

    కోణాల్కులోని పెద్దదేవాలయపు సమ్ముఖంలో అరుణస్తంభముండేది. దానిని మహారాష్ట్రులు పూరీకి తీసుకుపోయి, పూరీ సింహద్వారమందు స్థాపించి యున్నారు. అరునుడు సూర్యుని రథసారథి. చేతులు జోదించి దేవుని ధ్యానిస్తునాట్లు ఉంది. ఈ క్షేత్రానినే ఉల్లేఖిస్తూ శివాజీ ఏకామ్రకాననంలో భువనేశ్వరం “ఉత్కళ దేశం దేవతల ప్రియనికేతన” అని శంఖు పూరించాడు.

    ఇక్కడగల రామచండీమందిరమును కోణార్కు అధిషాత్రిదేవీ మందిరము. దీనినే కొందరు బుద్ధుని తల్లియగు మాయాదేవీమందిరము అంటారు. దీనిలోని ప్రతిమ ఇప్పుడు దేవాలయమునకు దగ్గరగా ఉన్నా లియాఖియా అనుగ్రామమందు ఉంది.కళాపహడు కోణాల్కముపై దండెత్తి వచ్చినప్పుడు రామచండిమందిరాన్ని ధ్వసం చేయతలచాడు. ఆదుస్థుతిలో దేవీ నీళ్ళుతెచ్చేనేపాన చంకలో బిందె పెట్టుకొని లియఖియాకు పోయింది. కళాపహాడ్ తుదకు నిరుత్సాహుడై దేవిని అన్వేషించుటకు పోయినాడు. లియఖియాలో దేవి తేలి ఉండటం చూసి ఎంతో పిలిచాడు, కాని లాభము లేకపోయింది. తుదకు కళపహాడ్ సిగ్గుపడి ఆమందిరమ్మీద ఇట్లు వ్రాసాడు.

    భోలా రామొచొండి, భోలారె

    కోళాపహోడుకు దువారె బోసాయి

    భోలాపాణి పాంయి గొలారె.

    అంటె రామచండి దుడుకుతనంతో తన్ను ద్వారంలో కూర్చుండబెట్టి నీళ్ళకోసం నదికిపోయి తిరిగి రాలేదని విసుగుపడి ఈపద్యం రాసాడు.

    ఇంకా ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ చూడవలసినదవి. ఈగ్రహాలు మనుష్యాకారంలో ఝేఏవాఖాలాళూ చిమ్మేటట్లు మెరుస్తున్నాయి. తలలపై ముకుటం, పద్మాసనం వేసినట్లు చక్కబడినవి. ఇంకా ఎన్నో మూర్తులు కాలావస్తలో శిథిల పడినవి. ఈ మూర్తులన్నిటింకీ ముఖ్యమంది సూర్యప్రతిమ. ఈ సూర్యప్రతిమకు తలపై మకుటం, చెవుల్లో కుండలాలు, కంఠంలో హారం, మెడలో జెందెం, వాటిలో మువ్వలు, కటిప్రదేశంలో మేఖల, దానికింద గ్రంథిమాల- ఆ ఘటన మనోభావభంగిమలు ఎంతో స్వాభావికంగా జీవకళలు తొణికిసినట్లు కనిపిస్తోంది. ఈ ప్రతిమనుకూడా కొందరు బుద్ధదేవుని ప్రతిమ అని కొందరు భ్రమపడ్డారు. ఈ పుణ్య క్షేత్రంలో మాఘ సప్తమినాడు గొప్పయాత్ర జరుగుతుంది. ఇంకా కొన్ని యాత్రలు పూర్వం వైభవంగా జరిగేవి. వీటిలో ముఖ్యమైనవి చైత్రయాత్ర, రథయాత్ర, చంద్రభాగాయాత్ర.

    మతభేదం

    ముఖ్యమైన విషయమేమనగా- ఈకోణార్కము బౌద్ధావశేషమా, కాదా? ఈ విషయంలో చాలా మంది చారిత్రుకులు తర్కించి తర్కించి ఎన్నో గ్రంథాలు వ్రాసారు. ఈచోటనే హ్యూయంసాంగ్ యొక్క చెలితోలా లేకా చిత్రోత్పలా అనే బౌద్ధమత కేంద్రమొకటి ఉండేది. బౌద్ధయుంగంలో కళింగ రాజధాని దంతపురము ఈ చిత్రోత్పల పేరేనంటారు. హిందువులూ, బౌద్ధులూ గొప్ప స్నేహ భావంతో కలసిమెలసి ఉండెవారని హ్యూయంసాంగ్ చెప్పుతాడు. కోణార్కుకి మైత్రేయవనమని పద్మపురాణంలో వ్రాసివున్నది. బుద్ధదేవుని మారుపేరు మైత్రేయుడని, పాళీ భాషలో మైత్రేయుడని ఆక్షేత్రానికి అందుకోసమే మైత్రేయవనమని పేరువచ్చిందటారు. కోణార్కములో అర్కవటము (జిల్లేడు చెట్టు) ఉండేది. దానిక్రింద వటేశ్వరుడు కూడా నేటివరకు పూజింపబడుచున్నాడు. కపిలసంహితను బట్టి ఆచెట్టు క్రింద సూర్యభగవానుడె జపించాడని ప్రమాణం ఉంది. ఆస్థలాన్ని కొందరు బుద్ధిని బోధిద్రుమముండే దంటారు. ఆచెట్టు క్రిందనే బుద్ధదేవుడు 49 రోజులు తప్పస్సు చేసేడంటారు. కొందరు అమరకోశం బట్టి బుద్ధుని మారుపేరు అర్కబధువని, దేవుని పేరును బట్టి స్థలం పేరు కోణార్కమైదని అంటారు. నరసింహదేవుని తామ్ర శాసనంలో ఈ స్థలానికి కోణా కోణా లేదా కోణాకమనము అని పేరుంది. బుద్ధదేవుని మరొకపేరు కోణాకమనీ, అందువల్లనే కోణార్కము బుద్ధదేవుని నామాంతరమగు స్థలమనీ అంటారు. కోణార్కుకు అర్ధమేమంటే కోణ + అర్క = కోణార్క . పూరీక్షేత్రానికి (North-East) ఈశాన్య కోణంలోని అర్కదేవుని క్షేత్రం గనుక దీనికి కోణార్కమని పేరు. ఇలా చాలా విషయాల్లో కోణర్కమునకు బౌద్ధులకు సంబంధమును ఉంది.

    నిర్మాణకౌశలం

    కోణార్కు నిర్మాణానికి రెండు రకాల గాథలు ఇమకా ఒరిసాలో వాడుకలో ఉన్నాయి. ఒకటి లాంగులా నరసింహదేవుమంత్రి శివాయిసాంత్రా- రామచందీ పరమాన్నాం కథ. ఈకథ మాదలా పంచాంగంలో ఉంది.రెండోది చాలా చమత్కారమైంది. 1200లమంది శిల్పులు 16 సంవత్సరాల కాలంలో ఈ దేవాలయం కట్టిరని, అందులో ఒక ప్రధాన శిల్పి ఈ మందిర నిర్మాణంకోసం ఇంట్లో గర్భవతియగు భార్యను విడిచిపెట్టి కోణార్కమునకు పోయాడు. కొన్ని రోజులయ్యాక ఆశిల్పికి ఒక కురావాడు జన్మించాడు.ఆకుర్రవాడొకరోజు తోడిబాలురతో ఆడుకొనుచున్నాప్పుడు కుర్రవాళ్ళు తా తండ్రిలేని పిల్లడని అతనిని హేళన చేశారు. దానితో వాడు చాలా సిగ్గు పడి కోపంతో తల్లివద్దకు పోయి, తన తండ్రి ఎవరో చెప్పమని నిర్భందిచాడు. తండ్రి కోణార్కు మందిర నిర్మాణంలో పనిచేస్తున్నాడని చెప్పి తల్లి కొడుకుచేతుల్లో పోలి కోశం రేగిపళ్ళు పెట్టి పంపించింది.కుర్రవాడు తండ్రిని వెదుకుతూ కోణార్కమునకు చేరాడు. అప్పటిసరికి 1200 శిల్పులు మందిరమంతా నిర్మించి పూర్తిచేయలేకపోయారు. శిల్పులంతా నిరుత్సాహులై రాజావారి కఠినశాసనంకోసం భయబడ్డారు. ఆరాత్రి అందరూ పడుకున్న సమయం చూసి, శిల్పి బాలుడు స్వయంగా ఆమందిరము యొక్క ధ్వజాన్ని కట్టి పూర్తిచేశాడు. తెల్లవారాక శిల్పులు సంపూర్ణమందిరాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. కాని తమ్మందరినీ రాజు చేతకాని వాళ్ళని దూషిస్తాడని, ఆకుర్రవాని తండ్రికిలా ఆజ్ఞాపించారు. “బొరొళొహొ బొడెయిరె దాయీ కీ ఎకా పువొరొ దాయీ”. అనగా 1200 శిల్పులు పూచీయు లేక ఒక్క కొడుకు పూచీయా” అప్పుడు తండ్రి చాలా విషయావస్థలో పడి ఏమీ జవాబు చెప్పలేక, కుమారుడను ఆమందిర శిఖిరానికి తీసుకుపోయి అక్కడనుండి క్రిందకు జారవిడిచాడు. [1]

    పతనం

    కోణర్కపతనం! పతనమంటే గుండె జలదరిస్తుంది. ఆ నిర్మాణకౌశలము, ఆశోభ, ఆకారు కలాపము అదంతా ఎక్కడికి పోయింది? ఆ మొగసాల, ఆ భూషణాదులు, ఆ మందిరాలు ఏవీ? ఇంకా ఉన్నాయి భగ్న దశలో వికృతాకారాన్ని చూపిస్తూ. ఎన్ని గాలి తుపానులో! ఎన్ని భూకంపాలో! ఎన్ని పిడుగులో! దయా దాక్షిణ్యంలేక భారతీయ విజయ స్తంభాన్ని విరుగగొట్టింది. ఇంకా తనివితీరక పరదేశీయులు ఈ గౌరవ స్తంభాన్ని విరుగగొట్టారు. కర్కోటకుడగు కళాపహాడు కూడా వికలాంగు పరిచాడు. మరికొంత మంది మహమ్మదీయ నావికులు కుత్సిత బుద్ధి వినియోగించి ఉత్కలకళామణిని కనుమరుగు పరిచారు. ఇచ్చోటనే భక్త కబీరుదాసు పవిత్రసమాధి ఉమదని మరిచిరి. కాలం కడుపు నిండింది. కోణార్క పతనం పూర్తి చెందిది. హిందూదేవదేవీల దివ్య మందిరము, జాతీయ కాంతి సౌధము పోర్చుగీసుల ఆశ్రయ స్థలము నేడు ముక్కలు ముక్కలై మొండిబ్రతుకింకా బ్రతికే ఉంది. అంతే చాలు. మనకు ఆ జీర్ణ విజయ చిహ్నమే చాలు. ఆ గ్రుడ్డి దీపమే వెలుగు. 

]]>
https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%95%e0%b1%8b%e0%b0%a3%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95-%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%af%e0%b0%82/feed/ 0
పూరీ జగన్నాథ దేవాలయం https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%80-%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%a5-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%af%e0%b0%82/ https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%80-%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%a5-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%af%e0%b0%82/#respond Wed, 08 Jan 2025 06:26:33 +0000 https://cnuwyatra.in/?p=783

పూరి జగన్నాథుని ఆలయ శిఖరాలపై సుదర్శన చక్రానికి సంబంధమున్న వైదికర్మల చక్రాలు, పతాకాలు.ఎరుపు పతాకం జగన్నాథుడు భవనంలోనే ఉన్నాడని సూచిక.ఈ మధ్యనే కనుగొన్నగంగా రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం, ప్రస్తుతమున్న జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగాదేవ ప్రారంభించాడు. ఈ ఆలయంలోని జగన్మోహన, విమన భాగాలు అతని హయాం (సా.శ.1078 – 1148) లోనే నిర్మింపబడ్డాయి. కాని సా.శ. 1174 లో ఒడిషా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునఃనిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతమున్న రూపునిచ్చాడు.[5] 1558లో ఒడిషాపై ఆఫ్ఘన్ సేనాధిపతి కాలాపహాడ్ దాడి చేయక ముందు వరకు ఆలయంలో జగన్నాథున్ని కొలవటం కొనసాగింది. తర్వాత కాలంలో రామ చంద్ర దేవ, ఖుర్దా అనే స్వతంత్ర రాజ్యాన్ని ఒడిషాలో ఏర్పరిచినప్పుడు ఈ ఆలయాన్ని పవిత్రం చేసి, విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాడు.

 

ఐతిహ్యం

ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్‌ మొదలుపెట్టాడు. ఆయన మనుమడు రాజా అనంగభీమదేవ్‌ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనకో కథ ఉంది. జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడతాడు. విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి తెలివిగా దారిపొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునే లోగానే విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించనిదీ అందుకేనంటారు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి.

దేవాలయ మూలాలకు సంభందించిన కథ

ఈ ఆలయ మూలాలకు సంబంధించిన సంప్రదాయ గాథల ప్రకారం, క్రిత యుగం చివరలో అసలు రూపంలో జగన్నాథుడు (విష్ణువు విగ్రహరూపం), పూరి సముద్రతీర సమీపంలోని మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల లేదా ఒక నీలి ఆభరణంగా అవతరించాడు. అది ఎంత ప్రకాశావంతమైనదంటే దాన్ని చూసినవారికి తక్షణ మోక్షం లభిస్తుంది. కనుక ధర్మదేవుడు లేక యముడు దాన్ని భూమిలో దాచిపెట్టాలనుకున్నాడు. అందులో విజయం కూడా సాధించాడు.ద్వాపర యుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు అంతుపట్టని ఆ రూపం గురించి తెలుసుకోవాలని సంకల్పించి తన లక్ష్యం కోసం ఘోరమైన తపస్సు చేయసాగాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి, పూరి సముద్ర తీరానికి వెళ్లి అక్కడ తేలే చెట్టు దుంగను కనుక్కొని దాని కాండంలో నుంచి తనకు కావలసిన రూపును తయారు చేసుకొమ్మని అతన్ని ఆజ్ఞాపించాడు. ఆ రాజు చెక్క దుంగను కనుక్కొన్నాడు.తర్వాత అతను అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాడు. దానికి యజ్ఞనరసింహరాజు ప్రత్యక్షమై నారాయణున్ని నాలుగు అక్షలలో విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు. అవి పరమాత్ముణ్ణి వాసుదేవుని లాగా, వ్యూహని సంకర్షణ వలె, యోగమయని సుభద్ర లాగా, విభవున్ని సుదర్శన వలె నిర్మించామన్నాడు. రాజు ముందు విశ్వకర్మ చిత్రకారుని రూపంలో ప్రత్యక్షమై చెట్టునుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్రల రూపాలను తయారు చేశాడు

పురుషోత్తమ క్షేత్ర నామము , దాని విహిష్టత

స్కంద పురాణ లిపి ప్రకారం జగన్నాథుడే పురుషోత్తముడు .మానవులకు సాధ్గునాలతో జీవితాన్ని ఎలా గడపాలో తెలియచెప్పడానికి ఆయన దారుబ్రాహ్మణ అవతారం ఎత్తాడు.తన తోబుట్టువులైన బలభద్ర, సుభద్ర దేవిలలో అతనే ఉత్తముడు.శ్రీ దేవికి అతను ఉత్తమ భర్త.అన్నింటికన్నా గుర్తించదగినది మార్గాశిర్శ నెలలో అమావాస్య తర్వాత వెంటవెంటనే వచ్చు మూడు రోజులూ తన తల్లిదండ్రులు (కశ్యపుడు-అదితి, దశరథుడు- కౌశల్య, వాసుదేవుడు-దేవిక, నందుడు-యశోద) లకు ఇంద్రద్యుమ్న, రాణి గుండిచలతో కలిసి శ్రద్ధ నిర్వహిస్తాడు.కాని ఒక పాలకుడు కింద అతను రోజూ అలాగే పండుగలలో దొరికే సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు.తన అనుచరులు, తన ముందు లోంగిపోయినవారి పట్ల అమితమైన జాగ్రత్త తీసుకుంటాడు.

బౌద్ధ మూలాలు

కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తల సిద్ధాంతాల ప్రకారం, ప్రస్తుత ఆలయ PURI JAGANNATH TEMPLEస్థలంనందు క్రితంలో బుద్ధుని దంతాల అవశేషాలు కలిగిన ఒక బౌద్ధ స్థూపం ఉండేదని అంటుంటారు. అది తర్వాత కాలంలో శ్రీలంకలోని క్యాండికి తరలింపబడింది.ఆ సమయంలోనే వైష్ణవ మతంలోకి బౌద్ధ మతాన్ని కలగలిపారు. దీంతోటి జగన్నాథున్ని కొలవటం ప్రాముఖ్యమైంది. ఇదంతా పదవ శతాబ్దానికి ముందు అంటే ఒడిషాకి చెందిన సోమవంశి రాజుల హయాంలో జరిగింది.

మహారాజ రంజిత్ సింగ్ అనే ఒక గొప్ప సిక్కు చక్రవర్తి ఈ ఆలయానికి అధిక మొత్తంలో బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. (ఇది అమృత్సర్ లోని బంగారు ఆలయానికి అతనిచ్చిన దాని కన్నా ఎక్కువ). ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన, విలువైన వజ్రం కోహినూరును కూడా ఈ ఆలయానికే విరాళంగా ఇవ్వమని అతను తన చివరి కోరికగా ఆజ్ఞాపించాడు. కాని ఆ వజ్రం ఈ ఆలయానికి చేరుకోలేకపోయింది. కారణం అప్పటికే బ్రిటీషు వారు పంజాబ్ రాష్ట్ర సర్వ హక్కులను తెగ తెంపి, దాని జమీందారీ ఆస్తులను జప్తు చేశారు.

సంస్కృతుల మేలుకలయిక

పూరి జగన్నాథ్ లోని శ్రీక్షేత్రగా పిలవబడే స్థలం భారతీయ సంస్కృతులకు పూర్తిగా అద్దం పడుతుందని నమ్మకంగా చెప్పవచ్చు. ఈ సంస్కృతుల గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా దీని స్థల పురాణం గురించి తెలుసుకోవాలి. కాని ఇది ప్రపంచంలోని మిగతా దేశాలకు భిన్నంగా వుంటుంది. భారతీయ చరిత్రలోనే ఆ దేశం ఎక్కడా ఇతర దేశాల మీద దండెత్తడం కాని సరిహద్దు రాగద్వేషాలతో వాటిని ఆక్రమించుకోవటంగాని చేసిన దాఖలాలు లేవు.

చరిత్ర ప్రకారం జగన్నాథున్నే తీసుకుంటే శబరాలు అనే ఆదివాసీలు ఆయన్ను నారాయణుని మారు రూపంగా పూజిస్తారు. ఇంకొక నేపథ్యం ప్రకారం ప్రాచీన కాలంనుంచి అక్కడే నివసిస్తున్న ప్రజలు ఆయన్ను నీలిరాయితో తయారుచేసిన నారాయణుని ప్రతిరూపమైన నీలమాధవగా కొలుస్తారు. ఆయన్ను నీలగిరి (నీల పర్వతం) లేక నీలాచలకి తీసుకువచ్చి బలరామ (బలభద్ర), సుభద్ర సమేతంగా జగన్నాథునిగా నెలకొల్పారు. ఈ చెక్క విగ్రహాలు, ప్రాచీన కాలంనుంచి వస్తున్న చెక్క స్తంభాలను కొలవటం అనే ఆచారంతో ముడిపడివున్నాయి. వీటన్నిటికన్నా ఒడిషాకే చెందిన ఆదివాసీల వంశస్థులుగా చెప్పుకొనే ధైతపతులు ఇప్పటికీ ఆలయంలో జరిగే పూజాకార్యకలాపాలలో అధిక శాతంలో పాల్గొంటూ వుంటారు. వీటన్నిటిబట్టి మొదట్నుంచి శ్రీక్షేత్ర సాంస్కృతిక చరిత్ర హిందూ, ఆదివాసీల సంస్కృతుల కలయికతో ఏర్పడిందని దృఢంగా చెప్పవచ్చు. ఇది గర్వించదగ్గ మన జాతి ఔన్నత్యంలో ఒక భాగమయ్యింది. ఈ మూడు విగ్రహాలు త్రిరథ (జైన ఆచారాలు) గా పిలవబడే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానంద్, సమ్యక్ చరితలకు ప్రతీకగా ప్రాచుర్యమయ్యాయి.ఇవి మోక్షం లేక శిఖరాగ్రమైన ఆనందానికి మార్గంగా పిలవబడుతున్నాయి.

స్వామి జగన్నాథుడు విష్ణువు లేదా నారాయణ లేదా కృష్ణుడిగా, బలభద్రుడు శేషునిగా పూజలు అందుకుంటున్నారు. అదే సమయంలో ఈ ఆలయంలో నెలకొల్పబడిన విగ్రహాలను భైరవ (శివ, అజేయుడు), విమల (భైరవి, శివుని భార్య) గా కూడా చూస్తుంటారు. కాబట్టి పూరి జగన్నాథ్ లో ఉన్న శ్రీక్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలు, హిందూ మతానికి చెందిన శైవతత్వం, శక్తితత్వం, వైష్ణవతత్వం వల్ల, అలాగే జైనమతం, బౌద్ధమతంలోని కొంత భాగాలు మేలుకలయికతో ఏర్పడి, ఎప్పటినుంచో అలాగే కలగలిపి ఉన్నాయని మనం గుర్తించవచ్చు.

ఆచార్యులు , జగన్నాథ పూరి

మాధవాచార్యులు తప్ప ఈ క్షేత్రాన్ని అందరు ఆచార్యులు దర్శించారు.ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు.దీంతో పాటు రామానుజాచార్య, నింబర్కాచార్య, గుడియ వైష్ణవ మతానికి చెందిన అనేక మఠాలను ఇక్కడ చూడవచ్చు.శ్రీపాద వల్లభాచార్య కూడా పూరి సందర్శించినప్పుడు ఇక్కడ తన భైఠకాన్ని ఏర్పరుచుకున్నారు.గురునానక్, కబీర్, తులసీదాస్ లు కూడా ఈ స్థలాన్ని దర్శించినట్లు ఆధారాలు ఉన్నాయి.

నిర్మాణం

పూరి లోని రథ యాత్ర పండుగజేమ్స్ ఫెర్గుస్సన్ చేసిన చిత్రం

ఈ భారీ ఆలయ భవనం 400,000 square feet (37,000 మీ2) కన్నా ఎక్కువ వైశాల్యంతో ప్రహరీగా చుట్టూ ఎత్తైన కోటగోడలను కలిగి ఉంది. ఇందులో కనీసం 120 గుళ్ళూ, పూజా స్థలాలు ఉన్నాయి. ఒడిషా శైలి నిర్మాణ గుణాలను, అమోఘమైన శిల్ప సంపదను కలిగిన ఈ ఆలయం, భారత అద్భుత కట్టడాలలో ఒకటి.

ప్రధాన ఆలయం కిందనుంచి పైకి కొంచెం వంపులు తిరిగి ఉండి దానిపైన విష్ణువుకు చెందిన శ్రీచక్ర (ఎనిమిది ఆకుల చక్రం) వుంటుంది. “నీలచక్ర”గా కూడా పిలవబడి, అష్టదాతుతో తయారైన ఈ చక్రం ఎంతో పవిత్రమైనది. ఈ ఆలయ ధ్వజస్తంభం ఎత్తైన ఒక రాతి దిమ్మపై నిర్మింపబడింది. ఇది విగ్రహాలు వున్న గర్భగుడి కన్నా ఎత్తు214 అడుగులు (65 మీ.)లో ఉంది చుట్టు పక్కల పరిసరాలలో పెద్దదిగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న గుళ్ళు, మండపాల న్యూచగస్తూప రూపంలోని గోపురాలు ధ్వజస్తంభం చుట్టూ మెట్లుగా ఉండి పర్వతశ్రేణిని తలపిస్తాయి.

ప్రధాన పూజాస్థలం ఎత్తైన గోడతో చుట్టబడి 20 అడుగులు (6.1 మీ.) ఉంటుంది. ఇంకొక గోడ ప్రధాన ఆలయాన్ని చుట్టి ఉంటుంది.

సింహద్వారం

బడా దందా లేదా పెద్ద మార్గం

సంస్కృతంలో సింగద్వారం గా పిలవబడే సింహ ప్రవేశం ఆలయంలోని నాలుగు ద్వారాలలో ఒకటి, ఆలయం లోపలికి వెళ్ళటానికి ప్రధాన ప్రవేశద్వారం. దీనికి ఆ పేరు రావటానికి కారణం ఆ ద్వారం రెండు ప్రక్కల ఉన్న గాండ్రించే సింహాల పెద్ద రాతి శిలలు. ఈ ద్వారం తూర్పు ముఖంగా ఉండి బడా దందా లేదా పెద్ద రోడ్డుకు దారి చూపుతుంది .బైసీ పహచ లేదా ఇరవై రెండు మెట్ల వరుస ఆలయ భవనంలోకి దారి చూపిస్తుంది. సంస్కృతంలో పతిత పావన గా పిలిచే జగన్నాథుని శిల్పం ప్రవేశంలో కుడివైపున చెక్కివుంటుంది. పతిత పావన అంటే అణగారిన, దిగజారిన వారి బాంధవుడు అని అర్థం. ప్రాచీన కాలంలో ఆలయంలోకి అంటరానివారు కు ప్రవేశం వుండేది కాదు కనుక వాళ్ళు ఈ పతిత పావనున్ని పూజించేవాళ్ళు. జయ, విజయ అనే ఇద్దరు ద్వారపాలకుల ద్వారానికి రెండు వైపులా నుంచుని వుంటారు.రథయాత్ర మొదలయ్యే ముందు జగన్నాథ్, బలభద్ర, సుభద్రల విగ్రహాలను ఈ దారిలోనే తీసుకెళ్తారు.వాటిని గుండీచ మందిరం నుంచి తీసుకు వచ్చేటప్పుడు తనను నిర్లక్ష్యం చేసి తమతో పాటు యాత్రకు తీసుకు వెళ్లనందుకు అలిగిన మహాలక్ష్మిని జాతర రూపంలో శాంత పరుస్తారు. అప్పుడే విగ్రహరూపంలో ఈ ద్వారా తలుపులపైన ఉన్న మహాలక్ష్మి వారిని ఆలయంలోకి రావడానికి అనుమతిని ఇస్తుంది. ప్రధాన ద్వారం ముందు అద్భుతమైన పదహారు ముఖ ఏకశిలా స్తంభామైన అరుణ స్తంభం కూడా ఉంది. దీని పైభాగంలో సూర్య భగవానుడి రథసారథి అయిన అరుణుడి విగ్రహం వుంటుంది.అసలు ఈ స్తంభం కోణార్క్ లోని సూర్య ఆలయంలో ఉంటే, ఖుర్దా రాజు ఇక్కడికి మార్పిడి చేయించాడు.

మిగతా ప్రవేశాలు

1870లో సింహాల శిలలు, ముందువరుసలో అరుణ స్తంభాన్ని కలిగిన సింగద్వారం.

పద్మా వేష అలంకారం లేదా తామర గర్భంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రల నకలులు.

ప్రధాన ప్రవేశమైన సింహ ద్వారం కాకుండా ఉత్తర, దక్షిణ, పడమటి దిక్కుల ముఖాలలో ఇంకా మూడు ప్రవేశాలున్నాయి. వాటిని రక్షించే జంతువుల శిలల ప్రకారం వాటి పేర్లు ఉంటాయి. అవి హాథిద్వార లేదా ఏనుగు ద్వారం వ్యాఘ్రద్వార లేదా పులి ద్వారం, అశ్వద్వార లేదా గుర్రం ద్వారం.

సింహ ద్వారం

ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలున్నాయి. సింహ ద్వారానికి ఇరు వైపులా రెండు భారీ సింహాల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇది తూర్పు వైపుకు తెరుచుకుని ఉంటుంది.

విగ్రహాలు

గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ్, బలభద్ర, సుభద్రల మూల విరాట్టులు రాత్నవేది అనే ఆభరణాలతో అలంకరించిన దిమ్మెపై కొలువు తీరి ఉంటారు. వీటితో పాటే సుదర్శన చక్ర, మదనమోహన, శ్రీదేవి, విశ్వధాత్రిల విగ్రహాలు కూడా రాత్నవేదిపై ఉంటాయి. జగన్నాథ్, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రాల విగ్రహాలు దారు బ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేప కాండాల నుంచి తయారయ్యాయి.కాలాలను బట్టి ప్రతిమల నగలు, దుస్తులను మార్పు చేస్తుంటారు. వీటిని కొలవటం ఆలయ నిర్మాణం ముందు నుంచే అంటే ప్రాచీన ఆదివాసుల కాలం నుంచే ఉండేది.

చిన్న ఆలయాలు

ఈ ఆలయ భవనంలోనే ఉన్న అనేకమైన చిన్న గుళ్ళు పూజా స్థలాలలో రోజూ పూజలు జరుగుతున్నాయి. మహాలక్ష్మి ఆలయానికి ప్రధాన ఆలయ పూజా కార్యక్రమాలలో ముఖ్య పాత్ర ఉంది.జగన్నాథునికి పెట్టె నైవేద్యాన్ని మహాలక్ష్మి పర్యవేక్షిస్తుందని చెబుతారు. కంచి గణేష్ ఆలయాన్ని విఘ్నేశ్వరుడికి అంకితం చేశారు. సంప్రదాయాల ప్రకారం ప్రాచీన కాలంలో గజపతి పురుషోత్తమదేవ కంచి యువరాణి పద్మావతిని వివాహమాడినప్పుడు కంచీపురం రాజు ఈ గణపతి విగ్రహాన్ని బహుకరించాడట.వీటితో పాటు ముక్తిమండపం, సూర్య, విమల, నరసింహ, రామచంద్ర, హనుమ, ఈశానేశ్వారుల పూజా స్థలాలు కూడా ఉన్నాయి.

మండపాలు

ఈ ఆలయంలో సాంస్కృతిక ఉత్సవాల కోసం అనేక మండపాలు, ఎత్తైన దిమ్మెలపై ఉన్న స్తంభ కూటములు ఉన్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందినది పవిత్ర బ్రాహ్మనులైన సేవాయతుల సమావేశాల కోసం చేయబడిన ముక్తి మండపం . ఇక్కడ రోజూవారీ పూజలు, పండుగలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న డోల మండపం లో గుర్తించదగినది రాతితో అందంగా చెక్కిన శిలా తోరణం. ప్రతి ఏటా జరిగే డోల యాత్ర పండుగలో ఈ తోరణాన్ని ఉయ్యాల కట్టడానికి ఉపయోగిస్తారు. ఈ సమయంలో డోలగోవిందుని ప్రతిమ ఈ ఉయ్యాల పై ఉంచుతారు. అలాగే ఇక్కడ ఉన్న స్నాన బేడి అనే దీర్ఘ చతురస్రాకార రాతి దిమ్మేలో జరిగే వార్షిక స్నాన యాత్రా సమయంలో జగన్నాథ్, బలభద్ర, సుభద్రల విగ్రహాలకు వేడుకగా స్నానం చేయిస్తారు.

ఆలయ వంటశాల , మహాప్రసాదం

జగన్నాథ ఆలయ వంటశాల భారతదేశంలోనే అతి పెద్ద వంటశాల. సంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వాటిని శ్రీమందిర రాణి అయిన మహాలక్ష్మి దేవి పర్యవేక్షిస్తుందని అంటారు. ఒకవేళ అక్కడ తయారైన వంటలలో ఏదైనా లోపం వుంటే వంటశాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని చెబుతుంటారు.మహాసురులుగా పిలిచే వంటవాళ్ళు దీన్ని మహాలక్ష్మిదేవి కలతకు ప్రతీకగా భావించి ఆ వంటను సమాధి చేసి మళ్ళీ కొత్తగా వంట మొదలు పెడతారు. ఇక్కడ మొత్తం వంటంతా హిందూ ఆచారాల ప్రకారం జరుగుతుంది. వంటకు మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు. వంట కోసం వంటశాల దగ్గర వున్నా గంగ, యమునా అనే రెండు పవిత్ర బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారు.ఇక్కడ ఐదు ప్రత్యేక ముహుర్తా లలో రత్నవేది, భోగ మండపాలలో ఉన్న ప్రతిమలకు పెట్టడానికి 56 రకాల నైవేద్యాలు ఉన్నాయి.ఆలయ వైదిక కర్మల ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు పెట్టె కోతోభోగ లేదా అబద అనే ప్రసాదం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. జగన్నాథునికి సమర్పించిన తర్వాత ఈ భోజనాన్ని తగినంత మొత్తంలో మహా ప్రసాదంగా ఆలయంలోని సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్న ఆనంద బజారులో పంచుతారు. అక్కడి భక్తులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

పండుగలు

స్నాన యాత్రా సందర్భంగా పూరి జగన్నాథ ఆలయాన్ని ధర్శించుకుంటున్న భక్తులు.

రోజూవారి ఆరాధనా సేవలు వివరంగా ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ఇక్కడ వేలాదిగా భక్తులు తరలివచ్చే పండుగలు అనేకం జరుగుతుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమయినది జూన్ లో జరిగే రథయాత్రగా పిలిచే రథాల ఉత్సవం పండుగ. ఈ బ్రహ్మాండమైన పండుగలో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రల విగ్రహాలు ఉన్న మూడు పెద్ద రథాలను ఊరేగిస్తారు.ఈ ఊరేగింపు బడా దందా గా పిలిచే పూరిలోనే అతిపెద్ద మార్గంనుంచి చివరి గమ్యస్థలమైన గుండీచ ఆలయం వరకు జరుగుతుంది.

ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిది ఏళ్ళకొకసారి ఏ ఎడాదిలోనైతే ఆషాఢ మాసం రెండుసార్లు వస్తుందో అప్పుడు నబకలేవర ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందనయాత్ర పండుగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ట మాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో డోలయాత్ర, వర్షాకాలంలో ఝులన్ యాత్ర లాంటి పండుగలను ప్రతిఏటా నిర్వహిస్తారు. పంజిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం, దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు.

అలాగే విమలాదేవి కోసం ఆశ్వీజ మాసం మహాలయ ప్రారంభానికి 8 రోజుల ముందు అలాగే విజయదశమి ముగింపునకు సూచకంగా జరిగే షోడశ దినాత్మక అనే 16 రోజుల పూజకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో మదనమోహన, విమల ఉత్సవ మూర్తులు పాలు పంచుకుంటాయి.

బ్రహ్మపరివర్తన వేడుక

పూరీ జగన్నాథ క్షేత్రంలో ఆలయంలోని జగన్నాథుడి మూలవిరాట్టులో ఉండే బ్రహ్మ పదార్థాన్ని.. కొత్తగా రూపొందించిన దారుశిల్పంలోకి మార్చే ఉత్సవాన్ని బ్రహ్మపరివర్తన వేడుక అంటారు. ఇది జ్యేష్ఠ మాసపు కృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రి ‘బ్రహ్మం’ మార్పిడి అత్యంత గోప్యంగా జరుగుతుంది, ఈ బ్రహ్మపదార్థం మార్పిడి పూర్తయితే కొత్త దారు విగ్రహాలకు జీవం వచ్చినట్టే భావిస్తారు. ఆ విగ్రహాలకు పట్టువస్త్రాలు ధరింపజేసి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.

అనావాసర లేదా అనాసర

వాడుక భాషలో విహార యాత్ర అని అర్థం.ప్రతీ ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగే పవిత్ర స్నాన యాత్ర తర్వాత జగన్నాధ, బలభద్ర, సుభద్ర, సుదర్శన విగ్రహాలు అనవాసర ఘర్గా పిలిచే రహస్య మందిరానికి వెళ్లి అక్కడే తర్వాత కృష్ణ పక్షం వరకు ఉంటాయి.కాబట్టి అప్పుడు వాటిని భక్తులు చూడడానికి వీలు పడదు.బదులుగా భక్తులు బ్రహ్మగిరి అనే సమీప ఊరిలో విష్ణు స్వరూపమైన అల్వర్నాథ్ అనే నాలుగు చేతుల రూపాన్ని కొలుస్తారు.భక్తులకు కేవలం రథయాత్ర ముందు రోజు మాత్రమే మొదటి చూపు దక్కుతుంది. దీనిని నవయవ్వన అని అంటారు. అధిక స్నానం తర్వాత దేవుళ్ళకు జ్వరం చేసిందని అందుకే పదిహేను రోజులపాటు రాజ వైద్యునితోటి చికిత్స చేయిస్తారు.

ప్రస్తుత ఆలయం

ప్రస్తుతకాల రథయాత్రలో దేవుళ్ళ విగ్రహాలను ఊరేగిస్తున్న మూడు రథాలు. వెనుక ఆలయాన్ని చూడవచ్చు.

ఇప్పటి నవీన సమయాలలో కూడా ఈ ఆలయం రద్దీగా ఉంటూ పనిచేస్తుంది.ఆలయ ప్రవేశానికి ఎవరిని అనుమతించాలో ఎన్నుకుంటుంది. హిందువులు కాని వారిని  అలాగే భారతీయులు కాని హిందువులను ఈ ఆలయ పరిసరాల్లోకి రానివ్వరు.ప్రవేశానికి అర్హులు కాని వారు దగ్గరలోని రఘురామ పుస్తకాలయం మిద్దె పైనుంచి ఆలయ కార్యకలాపాలను వీక్షించవచ్చు. ఆగంతకులు ఆలయం, దాని పరిసరాల్లోకి చొరబడినప్పుడు దొరికిన ఆధారాల వల్ల ఈ రక్షణ అమలులోకి వచ్చింది. బౌద్ధ, జైన మతస్తులు తమ భారత వంశ సంతతిని నిరూపించుకున్న తర్వాతనే వారికి ప్రవేశం కల్పిస్తారు. ఒకసారి 3 బాలి హిందువులకు ఆలయంలోకి ప్రవేశం కల్పించలేదు. కాని బాలి వాళ్ళు 90% హిందూ కాబట్టి ఈ సంఘటన తర్వాత నుంచి ఆలయంలోకి భారతీయులు కాని హిందువులకు కూడా ప్రవేశం కల్పిస్తున్నారు.

జగన్నాథ రథయాత్ర

జగన్నాథ రథయాత్రకు రథం తయారీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.

ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. వూరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. వూరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే… జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.

ఆషాఢ శుద్ధవిదియ… పూరీ క్షేత్రంలో పండుగ ఆ రోజు. భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతుంటుంది. జగన్నాథ జయజయధ్వానాలతో పూరీ నగరవీధులన్నీ మారుమోగుతుంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించి పోతారు. భక్తిపారవశ్యంతో మైమరచిపోతారు. ఆ క్షణం అపురూపం. స్వరం జగన్నాథం.

జగన్నాథ రథయాత్ర నేపథ్యం

రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరొకొందరు చెబుతారు. ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే… పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథబలభద్రుల కోసం ప్రధానాలయానికి మూడు కి.మీ. దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచామందిరం జగన్నాథుడి అతిథిగృహం అన్నమాట!

రథయాత్రకి ఏర్పాట్లు

జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయతృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకీ, 763 కాండాలను బలరాముడి రథనిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ వినియోగిస్తారు.

ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథనిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటిచారలున్న పసుపువస్త్రంతో ‘నందిఘోష’ను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. పద్నాలుగు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం. ఎత్తు 43 అడుగులు. పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతిరథానికీ 250 అడుగుల పొడవూ ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు.

రథయాత్ర సంబరం

మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లిన పండాలు (పూజరులు) ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే ‘మనిమా(జగన్నాథా)’ అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా వాటిని వూరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా… దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడ్ని చూడగానే జై బలరామా, జైజై బలదేవా అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో బోడోదండా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథా అంటూ భక్తిపారవశ్యంతో జయజయధ్వానాలు చేస్తారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండీ అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ మూడు విగ్రహాలనూ తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు… ఇంద్రద్యుమ్న మహారాజుకన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం… వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది.

సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా… పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చెరా పహారా అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ, సుభద్రాదేవినీ అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి.జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి… జై జగన్నాథా అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. విశాలమైన బోడోదండ (ప్రధానమార్గం) గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు.భక్తుల తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే… జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్రపేరిట పదిరోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది.

ప్రయాణ మార్గాలు

  • ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం ఉంది.

  • భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్‌ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో ఉంది.

  • దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.

  • కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో ఉంది.

  • భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.

]]>
https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%80-%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%a5-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%af%e0%b0%82/feed/ 0
లింగరాజ దేవాలయం https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%af%e0%b0%82/ https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%af%e0%b0%82/#respond Wed, 08 Jan 2025 06:17:49 +0000 https://cnuwyatra.in/?p=778

“లింగరాజు” ఇక్కడికి దారి మళ్లించారు. కార్యకర్త కోసం, లింగరాజ్ ఆజాద్ చూడండి .

లింగరాజ ఆలయం ( ఒడియా: [liŋɡɔraːd͡ʒɔ] ) శివునికిఅంకితం చేయబడినఒకహిందూ దేవాలయంభారతదేశంలోనిఒడిషారాష్ట్ర రాజధాని అయినభువనేశ్వర్‌లోనిపురాతనదేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం భువనేశ్వర్ నగరంలో అత్యంత ప్రముఖమైన మైలురాయి మరియు రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఇక్కడ కూడా ఆమె భార్య పార్వతిగా ప్రసిద్ధి చెందిన అన్నపూర్ణ లేదా గిరిజ అని పిలుస్తారు.

భువనేశ్వర్‌లోని లింగరాజ దేవాలయం అతిపెద్ద దేవాలయం. ఆలయ మధ్య గోపురం 180 అడుగుల (55 మీ) ఎత్తు ఉంది. ఈ ఆలయం కళింగ వాస్తుశిల్పం యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది మరియు భువనేశ్వర్‌లోని నిర్మాణ సంప్రదాయం యొక్క మధ్యయుగ దశలను ముగించింది. ఈ ఆలయం సోమవంశీ రాజవంశం నుండి రాజులచే నిర్మించబడిందని విశ్వసించబడింది , తరువాత గంగ పాలకుల నుండి చేర్చబడింది. ఈ ఆలయం దేవలా శైలిలో నిర్మించబడింది, అవి విమానం (గర్భగృహంతో కూడిన నిర్మాణం), జగమోహన (అసెంబ్లీ హాల్), నటమందిర (ఉత్సవ హాలు) మరియు భోగ-మండప (నైవేద్యాల మందిరం) అనే నాలుగు భాగాలను కలిగి ఉంటాయి . పూర్వీకుడు. ఆలయ సముదాయంలో 108 ఇతర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మరియు పెద్ద కాంపౌండ్ గోడతో చుట్టబడి ఉంది.

13వ శతాబ్దపు సంస్కృత గ్రంధమైన ఏకామ్ర పురాణంలో పేర్కొన్న విధంగా లింగరాజు యొక్క దేవుడు మొదట మామిడి చెట్టు (ఏకామ్ర) కింద ఉండేవాడు కాబట్టి భువనేశ్వర్‌ను ఏకామ్ర క్షేత్రంగా పిలుస్తారు . భువనేశ్వర్‌లోని ఇతర ఆలయాల మాదిరిగా కాకుండా, ఈ ఆలయం పూజా కార్యక్రమాలలో చురుకుగా ఉంటుంది. 12వ శతాబ్దంలో పూరీలో జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన గంగా పాలకుల నుండి వచ్చిన జగన్నాథ శాఖకు ప్రాధాన్యత పెరగడం వల్ల ఈ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి . ఆలయ కేంద్ర దైవం లింగరాజును శివునిగా పూజిస్తారు.

లింగరాజ ఆలయాన్ని టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నిర్వహిస్తుంది . ఈ ఆలయానికి రోజుకు సగటున 6,000 మంది సందర్శకులు ఉంటారు మరియు పండుగల సమయంలో వందల వేల మంది సందర్శకులు వస్తుంటారు. శివరాత్రి ఉత్సవం ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ మరియు 2012లో 200,000 మంది సందర్శకులు వచ్చారు. ఆలయ సమ్మేళనం హిందువులు కానివారికి తెరవబడదు, కానీ గోడ పక్కన వీక్షణ వేదిక ఉంది, ఇది ప్రధాన బాహ్య భాగాల యొక్క మంచి వీక్షణను అందిస్తుంది. ఇది వాస్తవానికి వైస్రాయ్ సమయంలో లార్డ్ కర్జన్ సందర్శన కోసం నిర్మించబడింది.

]]>
https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%af%e0%b0%82/feed/ 0
బుధ గయ https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%ac%e0%b1%81%e0%b0%a7-%e0%b0%97%e0%b0%af/ https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%ac%e0%b1%81%e0%b0%a7-%e0%b0%97%e0%b0%af/#respond Wed, 08 Jan 2025 06:07:44 +0000 https://cnuwyatra.in/?p=773

 

బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో ఉన్న మహాబోధి ఆలయ సముదాయంతో అనుబంధించబడిన ఒక మతపరమైన ప్రదేశం మరియు తీర్థయాత్ర . గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెప్పబడే ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది ( పాలి : బోధి ) బోధి వృక్షంగా పిలువబడింది . పురాతన కాలం నుండి, బోధ్ గయా హిందువులు మరియు బౌద్ధులకు తీర్థయాత్ర మరియు పూజల వస్తువుగా మిగిలిపోయింది . ప్రత్యేకించి, శిల్పాలతో సహా పురావస్తు పరిశోధనలు, ఈ ప్రదేశం మౌర్యుల కాలం నుండి బౌద్ధులచే వాడుకలో ఉందని చూపిస్తుంది .  12వ శతాబ్దం CEలో ఢిల్లీ సుల్తానేట్ యొక్క కుతుబ్ అల్-దిన్ ఐబక్ మరియు భక్తియార్ ఖిల్జీ నేతృత్వంలోని ముస్లిం టర్కీ సైన్యాలు బోద్ గయా మరియు సమీప ప్రాంతాలను ఆక్రమించాయి మరియు నాశనం చేశాయి .

బౌద్ధులకు, గౌతమ బుద్ధుని జీవితానికి సంబంధించిన నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలలో బోధ్ గయా చాలా ముఖ్యమైనది, మిగిలిన మూడు ఖుషీనగర్ , లుంబినీ మరియు సారనాథ్ . 2002లో, బోధ్ గయాలో ఉన్న మహాబోధి దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారింది .

పాట్నా నుండి 110 కిలోమీటర్లు (68 మైళ్ళు) దూరంలో , 24°41′43″N 84°59′38″E , వద్ద ఉన్న ఈ సముదాయంలో వజ్రాసనం లేదా “వజ్ర సింహాసనం” మరియు పవిత్రమైన బోధి వృక్షం ఉన్న మహాబోధి ఆలయం ఉంది. . ఈ చెట్టు మొదట శ్రీలంకలోని శ్రీ మహా బోధి వృక్షం యొక్క మొక్క , ఇది అసలు బోధి వృక్షం యొక్క మొక్కగా చెప్పబడే దాని నుండి పెరిగింది.

సుమారు 250 BCEలో, బుద్ధుడు జ్ఞానోదయం పొందిన 200 సంవత్సరాల తర్వాత, అశోక చక్రవర్తి పవిత్ర స్థలంలో ఒక మఠం మరియు పుణ్యక్షేత్రాన్ని స్థాపించడానికి బోధ్ గయాను సందర్శించాడు.

ఈ ప్రారంభ దేవాలయం యొక్క ప్రాతినిధ్యాలు సాంచిలో , స్థూపం I యొక్క తోరణాలపై, సుమారు 25 BCE నాటివి, మరియు ప్రారంభ శుంగ కాలం నుండి ( c.  185  – c.  73 BCE ) భర్హుత్ వద్ద ఉన్న స్థూపం రెయిలింగ్ నుండి రిలీఫ్ చెక్కడంపై కనిపిస్తాయి . .

]]>
https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%ac%e0%b1%81%e0%b0%a7-%e0%b0%97%e0%b0%af/feed/ 0
గయ https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%97%e0%b0%af/ https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%97%e0%b0%af/#respond Wed, 08 Jan 2025 05:58:42 +0000 https://cnuwyatra.in/?p=767

విష్ణు పాద దేవాలయం, గయ

గయాసురుడు అనే అసురుని శరీరభాగాలైన తల, నాభి, పాదం గయాక్షేత్రాలుగా పవిత్రత పొందిందని పౌరాణిక కథనం. ఆయన శరీరం అత్యంత పవిత్రమైనదిగా, పితృతర్పణాలతో పితృదేవతలను తరింపజేసేదిగా విష్ణువు వరమివ్వడంతో ఈ మూడు ప్రాంతాలు పితృతర్పణాలకు అత్యంత ప్రసిద్ధి చెందాయి.

క్షేత్రాలు

దేశవ్యాప్తంగా గయాక్షేత్రాలు 3 ఉన్నాయి.

  1. శిరోగయ – గయాసురుని తలభాగంలో ఉన్న ప్రదేశం ప్రస్తుత గయ (బీహార్) లో ఉంది.

పౌరాణిక కథనం

గయాసురుడు కావడానికి రాక్షసుడే అయినా మహా భక్తుడు. ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంతవ్సరాలు మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా గొప్ప తపస్సు చేశారు. తను చేసిన అద్భుతమైన తపస్సుకు ప్రసన్నుడై మహావిష్ణువు వరం కోరుకొమ్మనగా నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థాలకన్నా పవిత్రమై ఉండేలాగా వరం కావాలని కోరుకున్నారు. విష్ణువు ఆ కోరికను మన్నించగా గయాసురుని శరీరం పరమ పవిత్రమైపోయింది. బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్తేయ, గురుతల్ప మొదలైన పంచమహాపాపాలు సహితంగా అన్ని రకాల పాపాలు ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి. ఆయనను తాకివెళ్ళిన ప్రతివారూ నేరుగా మోక్షాన్ని పొందేవారు, అంతేకాక కీటకాలు, సూక్ష్మజీవులు కూడా గాలికి కొట్టుకువస్తూ ఆయన శరీరాన్ని తాకిపోతూండగానే మోక్షాన్ని పొందేవి.
ఇది కాక ఆయన చేసిన గొప్ప యాగాలు, పుణ్యకార్యాల వల్ల నేరుగా ఇంద్రపదవి లభించింది, అప్పటివరకూ స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవీభ్రష్టుడయ్యారు. పదవిని కోల్పోయిన ఇంద్రుడు కూడా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. బ్రహ్మ ఓ గొప్ప యాగాన్ని తలపెట్టానని, దానికి తగ్గ పరమ పవిత్రమైన స్థలాన్ని చూపించమని గయాసురుణ్ణి కోరారు. గయాసురుడు చాలా భారీకాయుడు. 576 మైళ్ళ పొడవు, 268 మైళ్ళ నడుము చుట్టుకొలత కలిగిన అతికాయుడు కాబట్టి పవిత్రమూ, విశాలమూ అయిన తన తలపై యజ్ఞం చేసుకొమ్మని అనుమతించారు.
బ్రహ్మ యాగం వేడికి గయుని తల కదలడం ప్రారంభించింది. దాన్ని కదలకుండా చేసేందుకు బ్రహ్మ చాలా పెద్దపెద్ద శిలలను గయాసురిని తలపై పెట్టసాగారు. ఆ శిలలేవీ కూడా గయాసురుని తల కదలకుండా ఆపలేకపోగా అవన్నీ చుట్టూ పడి రామపర్వతం, ప్రేతపర్వతం వంటివి ఏర్పడ్డాయి. దానితో బ్రహ్మ చివరకు మరీచి శాపం వల్ల శిలగా మారిన మహాపతివ్రత దేవవ్రత శిలను తీసుకువచ్చి తలపై పెట్టారు. శిలారూపంలోనున్న మహాపతివ్రతను తోసివేయలేక కదలికలు కట్టడి చేసుకున్నా మొత్తానికి మానుకోలేకపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన గదాధారుడై వచ్చి తన కుడికాలు గయాసురుని తలపై పెట్టి తొక్కిపట్టారు
గయాసురుడు ఆ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించి నా శరీరం పరమ పవిత్రమైన తీర్థక్షేత్రంగా వరం పొందింది. నా తలపై బ్రహ్మదేవుడే యాగం చేశాడు. పతివ్రతయైన దేవవ్రత శిలారూపంలో నిలిచింది. సాక్షాత్తూ మహావిష్ణువువైన నీవే కుడిపాదాన్ని పెట్టావు. ఇన్ని పొందిన నా శిరోమధ్యపాద భాగాలు పితృదేవతలను సైతం తరింపజేసే ప్రభావశాలి, పరమ పవిత్రమూ అయిన దివ్యక్షేత్రములయ్యేట్టుగా, అవి తన పేరున వ్యవహరింపబడేట్టుగా వరం కావాలని కోరి పొందారు.
ఈ కథలోనే కొన్ని వేర్వేరు చిరు భేదాలు ఉన్నాయి. మరో కథనం ప్రకారం గయుడు ఇంద్రుడు కావడం కాక గయుని మహా ప్రభావం వల్ల ఆయనను చూసినవారు, తాకినవారు నేరుగా బ్రహ్మమును పొందుతూండగా వేదకర్మలు నశిస్తూన్న స్థితి ఏర్పడింది. దానితో లోకంలో వేదకర్మలు నశించగా, ఇంద్రాదుల కోరికపైన (కొన్ని కథనాల్లో స్వయంగానూ) బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించి, గయుని తలపై చేస్తారు. రాత్రి మొత్తం ఉండే ఈ యాగం తెల్లవారినాకా పూర్తవుతుంది. ఐతే శివుడు కుక్కుటరూపంలో (కోడిపుంజుగా) వచ్చి కూయడంతో నిజంగా తెల్లవారిందేమోనని భ్రమించిన గయాసురుడి హఠాత్ కదలికల వల్ల యాగం అర్ధాంతరంగా ఆగిపోతుంది. నిర్ణయించిన దాని ప్రకారం శిక్షగా ఆయన తలను పాతాళానికి తొక్కుతారు అనేది ఆ ప్రత్యామ్నాయ కథనం చెప్పే విషయం.

]]>
https://cnuwyatra.in/2025/01/08/%e0%b0%97%e0%b0%af/feed/ 0